వరుస విజయాలతో హీరోయిన్ శృతిహాసన్ మంచి జోరుమీద వుంది. ఒక ప్రముఖ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ భామ మాట్లాడుతూ “నాకు ఒకే లక్ష్యం పెట్టుకుని దానికోసం తపించడమనే విషయంపై అంతగా ఇష్టంలేదు. ఆ సమయంలో నాకునచ్చిన విషయాన్ని నేర్చుకుంటా. అది నాకు ఉపయోగపడుతుందా లేదా అన్న విషయం నాకు అనవసరం. ఉదాహరణకు నేను నెమ్మదిగా సంగీతంపై మక్కువ పెంచుకుని అటువైపు ఆసక్తిని పెంచుకున్నాను. దానికోసం అమెరికా కూడా వెళ్లాను. కొత్తదనాన్ని ఏదైనా త్వరగా నేర్చుకోవడం అంటే నాకిష్టం, అది ఎప్పటికైనా నాకు ఉపయోగపడుతుంది అన్న నమ్మకం నాకుంది” అని తెలిపింది. ప్రస్తుతం ఈ భామ ‘రామయ్యా వస్తావయ్యా’, ‘రేస్ గుర్రం’ సినిమాలతో బిజీగావుంది.
ఈ ఏడాది భారీ ఆఫర్లను సొంతం చేసుకున్న శృతి టాలీవుడ్ తో పాటూ బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఎవడు’ సినిమా షూటింగ్ ముగించుకుని విడుదలకు సరైన సమయంకోసం ఎదురుచూస్తుంది.
ఈ ఏడాది భారీ ఆఫర్లను సొంతం చేసుకున్న శృతి టాలీవుడ్ తో పాటూ బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఎవడు’ సినిమా షూటింగ్ ముగించుకుని విడుదలకు సరైన సమయంకోసం ఎదురుచూస్తుంది.