ఎన్నో అంచనాలు పెట్టుకొని వచ్చిన రామయ్యా వస్తావయ్యా.. తొలి రోజు నుంచే డివైడ్ టాక్ తో నడుస్తోంది. ఫస్టాఫ్ బాగానే ఉంది అన్నవారంతా.. సెకండ్ ఆఫ్‌ని వేలెత్తి చూపిస్తున్నారు. కాస్త నిడివి పెరిగిందని, షార్ప్‌గా ఉంటే బాగుండేదనే కామెంట్లు వినిపించాయి. అందుకే ఇప్పుడు చిత్రబృందం సెకండాఫ్‌కి మెరుగులు దిద్దే పనిలో పడింది. రామయ్యా వస్తావయ్యా సెకండాఫ్‌లోని 12 నిమిషాల నివిడిగల సన్నివేశాలు కత్తిరించారు. ఆదివారం ఎడిట్ చేసిన సినిమానే బయటకు వచ్చింది. దిల్ రాజు స్వయంగా ఎడిట్ రూమ్‌లో కూర్చుని కత్తెరకు పనిచెప్పారట. ఆయన ముందు నుంచీ సెకండాఫ్‌పై అసహనంగా ఉన్నారని టాక్. ఇప్పుడు ఆయనే రంగంలోకి దిగి.. ఎడిటర్ అవతారం ఎత్తారు. ఈ మార్పుల తరవాతైనా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో చూడాలి.

