ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Wednesday, 9 October 2013

    రియల్ స్టార్ శ్రీహరి కన్నుమూత

    Srihari Died
    తెలుగు సిని పరిశ్రమలో మరో విషాద ఘట్టం బుధవారం చోటు చేసుకుంది. విలన్ గా హీరోగా, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులను రంజింప చేసిన శ్రీహరి బుధవారం సాయంత్రం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  మరణించాడు. ఈ వార్త టాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. వారం రోజులుగా  లివర్ వ్యాదితో తీవ్ర అస్వస్థతకు లోనై ఆసుపత్రిలో చేరిన ఆయన మృతి చెందడం ఆయన కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగి పోయారు.

    ఇటీవలే ఆయన జన్మదిన వేడుకలను కూడా అభిమానుల మద్య హైదరాబాద్ లోని తన నివాసంలో ఘనంగా జరుపుకున్నారు. ఆయన ఆగస్టు 15,1964 హైదరాబాద్ లోని బాల్ నగర్ లో జన్మించాడు. 1986 లో దాసరి నారాయణ సినిమాలకు పరిచయం చేసినా, 1989లో పిళ్లై తమిళ సినిమాతో నటుడిగా గుర్తింపు పొందాడు. ఆతరవాత 1993 లో తెలుగులో కుంతీ పుత్రుడు సినిమాతో తెలుగు పరిశ్రమలో విలన్ గా ప్రవేశించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    ఆతర్వాత ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి, తరవాత హీరోగా సినిమాలు తీసి మంచి గుర్తింపును పొందాడు.  పోలీసు పాత్రలు ఆయనకు విశేష గుర్తింపును తెచ్చిపెట్టాయి. సినిమా రంగంలోనే క్లబ్ డాన్సర్ గా రానిస్తున్న డిస్కోశాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. విలన్ గా ఆయన నటించిన ఆఖరు సినిమా జంజీర్, తూఫాన్, ఇందులో రాంచరణ్  హీరో. ఇక  హీరోగా నటించిన ఆయన చివరి సినిమా ‘పోలీస్ గేమ్’ ఇటీవల విడుదల అయింది, టీ సమోస బిస్కట్ తో పాటు మరో రెండు మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

    Tollywood

    Bollywood

    Kollywood