మహేష్‌బాబుతో సినిమా చేయడమంటే ఇప్పుడు నిర్మాతల చేతిలో బంగారు గని ఉన్నట్టే. కెరీర్‌లోనే బెస్ట్ ఫామ్‌లో ఉన్న మహేష్ ఇప్పుడు నిర్మాతల పాలిట కొంగు బంగారం అవుతున్నాడు. అతని డేట్స్ సొంతం చేసుకున్న నిర్మాతలు తమ చేతిలో అంతులేని నిధి నిక్షేపాలు ఉన్నట్టు ఫీలవుతున్నారు. అందుకు తగ్గట్టే మహేష్ నటించే ప్రతి సినిమాకీ బయ్యర్ల నుంచి కనీ వినీ ఎరుగని ఆఫర్స్ వస్తున్నాయి. ఇంటా బయటా, దేశం అవతలా కూడా సమానంగా క్రేజ్ ఉన్న మహేష్ సినిమాపై పెట్టుబడి పెడితే లాభం గ్యారెంటీ అని అంతా నమ్ముతున్నారు. అందుకే అన్ని ఏరియాల నుంచి ఈ చిత్రానికి సూపర్ ఆఫర్స్ వస్తున్నాయి.
మహేష్ ప్రస్తుతం చేస్తున్న 1-నేనొక్కడినే చిత్రానికి కూడా బిజినెస్ క్రేజ్ బీభత్సంగా ఉంది. కర్నాటక ఏరియా రైట్స్‌ని నాలుగున్నర కోట్ల రూపాయలకి ఓ డిస్ట్రిబ్యూటర్ సొంతం చేసుకున్నాడు. ఇది అల్లాటప్పా విషయం కాదు. పక్క రాష్ట్రంలో తెలుగు సినిమా ఇంత రేటు పలికిందంటే మహేష్ అక్కడ ఎంతటి పెద్ద స్టార్ అనేది తేటతెల్లమవుతోంది. కర్నాటకలో చాలా తక్కువ తెలుగు చిత్రాలు మాత్రమే ఈ మార్కుని దాటగలిగాయి.