యువ హీరోల జమానా మొదలైన తర్వాత సీనియర్ హీరోలు బాగా డల్ అయ్యారు. ఒకప్పుడు నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ల సినిమాలంటే తప్పకుండా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనేది. ఆ చిత్రాలకి ఖచ్చితంగా ఓపెనింగ్స్ బాగుండేవి. కానీ ఇప్పుడు మహేష్, పవన్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలకి మాత్రమే అలాంటి సందడి కనిపిస్తోంది. నాగార్జునకి హిట్ వచ్చి చాలా కాలం అవుతోంది. కింగ్, రగడ, ఢమరుకం అన్నీ యావరేజ్‌గా ఆడాయి. విమర్శకులు ప్రశంసించిన రాజన్న, శిరిడిసాయి ఫెయిలయ్యాయి. నాగ్ నుంచి నిఖార్సయిన సక్సెస్ వచ్చి ఎంతో టైమ్ గడిచిపోయింది.
ఈ నేపథ్యంలో త్వరలో వస్తున్న 'భాయ్' సినిమాని జనం ఎగబడి చూస్తారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. సడన్‌గా ఇప్పుడు నాగార్జున సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోవాలంటే పబ్లిసిటీ దంచి కొట్టాలి. భాయ్‌కి పబ్లిసిటీ మొదలు పెట్టారు కానీ ఈ డోస్ సరిపోదు. ఈ సినిమాలో సాంగ్స్ బాగున్నాయని టాక్ వినిపిస్తోంది కానీ వాటికి ఎంత జనాకర్షణ శక్తి ఉందనేది భాయ్ ఆడియో రిలీజయ్యాకే తెలుస్తుంది.