ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 11 October 2013

    రామయ్యా... కరుణించాడయ్యా

    Ramayya Vasthavayya Collections
    రామయ్యా... కరుణించాడయ్యా అన్న టాక్ వినిపిస్తోంది ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా విషయంలో. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఈ సినిమాను దెబ్బ తీస్తాయి అనుకున్నారు. ఏ ముహూర్తం చూసి ఒక రోజు సినిమా విడుదలను వాయిదా వేసారో తెలియదు కాని అది ఎన్టీఆర్, దిల్ రాజులకు భలే కలిసి వచ్చింది అంటున్నారు.

    కారణం కరెంట్ కోతతో థియేటర్లు నడవడం కష్టం అనుకుంటే ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందే వారు సమ్మె విరమించి ఆ బాద లేకుండా చేసారు. ఇక దసరా సెలవులను ఎంజాయ్ చేసేది ఎక్కువగా టీచర్లే, వారు కూడా సమ్మె విరమించడం, వారికి దసరా అడ్వాన్స్, జీతాలు ప్రభుత్వం ఇస్తుండడం కూడా రామయ్యకు భలే కలిసి వచ్చాయి అంటున్నారు.

    అంతేనా అసలు సిసలైన పెద్ద అవరోదం కూడా ఈ సినిమా విడుదల రోజే దూరం అవుతుంది అన్న టాక్ కూడా వినిపిస్తోంది. పల్లెలనుంచి పట్నం వచ్చి సినిమాలు చూడాలంటే బస్సులు బంద్  లో ఉన్నాయి. ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది అనుకున్నారు. కాని వారు కూడా శుక్రవారం సమ్మె విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో అడ్డుకుంటారనుకుంటే ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు అలాంటిదేం జరగలేదు. అందుకే రామయ్యను రామయ్యే కరుణించాడు అంటున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood