ఒక పెద్ద హీరోతో ఒక యువ హీరో కలిసి నటిస్తే తప్పకుండా ఫోకస్ అంతా పెద్ద హీరో కొట్టుకుపోతాడు. 'మసాలా' సినిమాలో రామ్‌తో కలిసి నటించిన వెంకటేష్ ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాడు. రామ్‌కి కూడా హీరోగా మంచి పేరే ఉన్నా కానీ ఈ సినిమాకి సంబంధించినంత వరకు వెంకటేష్ ఫాన్స్ హంగామా ఎక్కువగా ఉంది. అవడానికి ఇద్దరు హీరోల సినిమానే అయినా కానీ వెంకటేష్ ఎక్కువ హైలైట్ అయిపోవడం వల్ల రామ్ మరుగున పడిపోతున్నాడు. థియేటర్ల వద్ద హంగామా కూడా వెంకటేష్ ఫాన్స్‌దే కనిపిస్తోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాకి మహేష్ అభిమానుల సందడి ముందు వెంకీ వెలవెలబోయాడు. ఈ సినిమాకి మాత్రం వెంకటేష్‌నే హైలైట్ చేయాలని ఫాన్స్ కంకణం కట్టుకున్నట్టు ఉన్నారు. ఇప్పుడీ సినిమా హిట్ అయినా కూడా క్రెడిట్ మొత్తం వెంకటేష్‌కే కట్టబెట్టేటట్టున్నారు.
ఇద్దరు హీరోలు కలిసి నటించినప్పుడు ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అయితే ఇలాగే ఉంటుంది. మల్టీస్టారర్ సినిమాలన్నప్పుడు ఇద్దరూ పెద్ద స్టార్లే అయితే ఇలా ఎవరో ఒకరే మొత్తం క్రెడిట్ పట్టుకుపోయే ఆస్కారం ఉండదు. వెంకటేష్ తదుపరి మల్టీస్టారర్‌లో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఆ సినిమాకి చరణ్ ఫాన్స్ సందడి ఏమాత్రం తక్కువ ఉండదు కాబట్టి అప్పుడు వెంకీ ఫాన్స్ హంగామా ఎలా ఉంటుందనేది ఆసక్తికరం.