ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Wednesday, 13 November 2013

    దర్శకత్వం కూడా చేస్తుందట!

    Manchu Lakshmi Prasanna Turns to Director, Lakshmi Prasanna Latest Moies, Lakshmi Prasanna in Chandamama Kadalu Movie
    మోహన్ బాబు తనయ లక్ష్మీ ప్రసన్న ఆల్ రౌండర్ గా నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే నటన, నిర్మాణం, టీవీ హోస్టింగ్...  తదితర అంశాల్లో రాణిస్తోంది. తొలి చిత్రంతోనే ఉత్తమ ప్రతినాయికగా నంది పురస్కారాన్ని సొంతం చేసుకుంది. తండ్రికి కలగా మిగిలిన ఆ పురస్కారాన్ని తొలి ప్రయత్నంలోనే చేజిక్కించుకుని శభాష్ అనిపించుకుంది. నిర్మాణంలోనూ తనదైన శైలిలో రాణిస్తోంది. `ఊ కొడతారా ఉలిక్కిపడతారా`, `గుండెల్లో గోదారి` లాంటి వైవిధ్యమైన చిత్రాలు నిర్మించింది.

    అయితే లక్ష్మీ ఇంతటితో ఆగిపోవాలనుకోవడం లేదు. దర్శకత్వం కూడా చేయబోతున్నా అని తాజాగా ప్రకటించింది. ఎప్పటికైనా ఓ మంచి సినిమా చేయాలనేది నా కల. అది త్వరలోనే సాకారం కాబోతుందని లక్ష్మీ ప్రకటించింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... ``ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నా. ఓ ప్రముఖ కథానాయకుడు కాల్షీట్లు కూడా ఉన్నాయి. మంచి సమయం చూసుకుని సినిమాని ప్రారంభిస్తా`` అని చెప్పుకొచ్చింది. లక్ష్మీ ప్రస్తుతం `చందమామ కథలు` అనే సినిమాలో కీలకమైన పాత్ర చేసింది.

    Tollywood

    Bollywood

    Kollywood