ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Sunday, 24 November 2013

    అనుష్క కెరీర్‌లో మ‌చ్చ‌?

    అనుష్క కెరీర్‌లో మ‌చ్చ‌
    'అరుంధ‌తి' చిత్రంతో ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తెచ్చుకుంది అనుష్క‌. ఒక ర‌కంగా… ఆ చిత్రంతో క‌థానాయిక ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌కు పెద్ద దిక్కుగా మారింది. అనుష్క అంటే ఓ బ్రాండ్‌గా ప‌రిగ‌ణిస్తున్నారు అంతా. తన‌కు తాను నిర్మించుకొన్న ఆ గొప్ప బ్రాండ్ సౌధాన్ని ఇప్పుడు తానే కూల‌గొట్టుకుంది.

    ఆమె న‌టించిన ‘వ‌ర్ణ’ క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ప్రేక్ష‌కులు థియేట‌ర్‌లో క‌నీసం అర‌గంట కూడా కూర్చోలేని విధంగా ఆ సినిమా ఉందంటున్నారు విశ్లేష‌కులు. ఇది ఆమె కెరీర్‌కి పెద్ద దెబ్బ‌గా మార‌బోతోంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే అనుష్క ‘వ‌ర్ణ‌’ కోసం చాలా సినిమాల‌ను వ‌దులుకొని వ్య‌క్తిగ‌తంగా చాలా లాస్ అయ్యింది. ‘వ‌ర్ణ‌’ కోసం తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు క‌మర్షియల్ సినిమాలు కాద‌నుకొంది. ఈ సినిమా ఫ‌లితం ఆమె న‌టిస్తున్న సినిమాల‌పై ప‌డినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదంటున్నారు.

    క‌థానాయిక‌గా ఇంత అనుభ‌వాన్ని సంపాదించిన అనుష్క ‘వ‌ర్ణ‌’ విష‌యంలో మాత్రం ద‌ర్శ‌కుడు చెప్పింది గుడ్డిగా చేసేసింది. అదే విష‌యంపై ఇప్పుడు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ‘వ‌ర్ణ‌’ చిత్రం అనుష్క కెరీర్‌లో ఓ మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలిపోనుంది అంటున్నారు. ఈ సినిమాకోసం నిర్మాత పెట్టిన డ‌బ్బు కూడా తిరిగి రాని ప‌రిస్థితి. ప‌లుచోట్ల క‌నీస వ‌సూళ్లు లేవు. ఈ సినిమాపై ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో పీవీపీ సంస్థ‌లు ప‌లుచోట్ల సొంతంగా పంపిణీ చేసింది. వాస్త‌విక నేప‌థ్య‌మున్న సినిమాల‌ను ఇష్ట‌ప‌డే త‌మిళ ప్రేక్ష‌కులు కూడా ఈ సినిమాని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన‌ట్టు తెలుస్తోంది.

    Tollywood

    Bollywood

    Kollywood