ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 25 November 2013

    అనుష్క భాద 'వర్ణ'తీతం...

    అనుష్క భాద 'వర్ణ'తీతం...
    సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ తెచ్చుకున్న 'వర్ణ' సినిమా బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లాపడడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ... ఎంతో కాలాన్ని వెచ్చించి నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులపై ఏమాత్రం ఇంప్రెషనూ వేయలేకపోయింది. కథానాయిక అనుష్క పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరయింది. వాస్తవానికి ఈ సినిమాపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది.

    కెరీర్ చివరిదశలో వున్న తనకు మంచి ఫినిషింగ్ టచ్ ఈ సినిమాతో మొదలవుతుందని ఆమె భావించింది. అయితే, అందుకు భిన్నంగా జరగడంతో అనుష్క బాగా అప్సెట్ అయినట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అలాగే, ఈ సినిమా ఎఫెక్ట్ ఆమె నటించే ఇతర సినిమాలపై పడుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఆమె ప్రధానపాత్రధారిగా రూపొందుతున్న 'రుద్రమదేవి' సినిమాపై ఇమ్మీడియేట్ గా ఈ ప్రభావం వుంటుంది.

    Tollywood

    Bollywood

    Kollywood