ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 15 November 2013

    విభజన విషయంలో చిచ్చు పెట్టిన రాముడు

    విభజన విషయంలో చిచ్చు పెట్టిన రాముడు
    రాష్ట్ర విభజన విషయంలో ఇరు ప్రాంతాల నేతలే కాదు, చివరకు దేవుడు కూడా చిచ్చుపెట్టాడు. భద్రాద్రి రాముడే ఇప్పుడీ విభజన అంశాన్ని మరో బండతో బాదుతున్నాడు. దేవుడు అందరి వాడు అయితే తెలుగువారు మాత్రం ఈ రామచంద్రున్ని నావాడంటే నావాడు అంటూ తగువులాడుకుంటున్నారు. ఈ తగువులాట ఎక్కడి దాకా వచ్చిందంటే ఆయన కొలువై ఉన్న భద్రాచలంలో ఏకంగా 72 గంటల బంద్ నిర్వహించే వరకు వెల్లింది.

    దీంతో భధ్రాద్రి రాముడు విభజన విషయంలో పెద్ద కిరికిరి పెడుతాడన్న భావం దీంతో బలపడింది. 1954 కు పూర్వం భద్రాచలం ఆంద్రా ప్రాంతంలోనే ఉండేది. అయితే బౌగోళికంగా పరిస్థితులు తెలంగాణతో సరిపడేలా ఉండడం, పైగా పరిపాలనా సౌలభ్యం పరంగా కూడా దీనిని తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోనే కలిపితే ఈ ప్రాంతం అభివృద్ది చెందేలా ఉండడంతో అప్పట్లో తెలంగాణలో కలిపారు. అయితే హైదరాబాద్ విషయంలో తెలంగాణ వాదులు 1954 ముందటి హద్దులనే పరిగణలోకి తీసుకోవాలని కోరడంతో, సీమాంధ్ర వారు అదే మెలికను భద్రాచలం విషయంలో పెట్టడంతో ఇప్పటి వరకు లేని కొత్త అంశం తెలంగాణ ఏర్పాటులో లొల్లికి కారణమయింది.

    టిజేఏసి, జర్నలిస్టుల జేఏసి ఈ బంద్ కు పిలుపునిచ్చింది. భద్రాచలంను ఆంద్రాలో ఉంచాలన్నదానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం లేదని, కేవలం ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శితో తయారు చేయించిన నివేదికలో దీనిని పెట్టారని అందుకే పరిగణలోకి తీసుకోవద్దన్నది తెలంగాణ వాదుల వాదన. ఈ విషయంలో త్వరలో రాష్ట్రపతిని కూడా కలుస్తామని వారు చెప్పారు. అయితే సీమాంధ్ర ప్రాంతానికి సాగునీటి విషయంలో కల్పతరువు కానున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భద్రాచలం డివిజనే కీలకం కానుండడంతో వారు దీనిని వదులుకోవడానికి సిద్దంగా లేరు. దీంతో ఈవివాదం చిలికిచిలికి గాలి వానలా మారే ప్రమాదం ఉందంటున్నారు పరిశీలకులు.

    Tollywood

    Bollywood

    Kollywood