ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 15 November 2013

    రామ్‌చ‌ర‌ణ్‌పై అనుమానం ఎందుకు ?

    రామ్‌చ‌ర‌ణ్‌పై అనుమానం ఎందుకు
    మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ ఎవడు మూవీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావ‌ల్సి ఉండ‌గా, టైం అనుకూలించ‌క వాయిదాలు వేసుకోవ‌ల‌సి వ‌చ్చింది. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రొడ్యూజ‌ర్ దిల్ రాజు అఫిషియ‌ల్‌గా అనౌన్స్ చేశాడు. లేటెస్ట్‌గా ఆ రిలీజ్ డేట్ మారిందంటూ ఫిల్మ్ న‌గ‌ర్‌లో న్యూస్‌ తెగ చ‌క్కెర్లు కొడుతుంది.  

    డిసెంబ‌ర్ 19న ఎవ‌డు మూవీను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రాడ్యూజ‌ర్ కూడ అదే డేట్‌కు ఫిక్స్ అయ్యాడు. కాని ఆ డేట్‌ను త్వర‌లోనే మార్చే అవ‌కాశం ఉందంటూ కొంత మంది తెగ రూమ‌ర్స్‌ను క్రియోట్ చేస్తున్నారు. ఎవ‌డు రిలీజ్ డేట్‌ను మార్చటానికి ఒకే ఒక్క కార‌ణాన్ని చూపిస్తున్నారు. 2013 సంవ‌త్సరంలో రామ్‌చ‌ర‌ణ్ నాయ‌క్ మూవీతో స‌క్సెస్‌ను కొట్టాడు. అలాగే రిలీజ్‌కు ఆగిపోయిన ఎవ‌డు మూవీను కూడ కొద్దిగా టైం తీసుకొని, 2014లో రిలీజ్ చేసి స‌క్సెస్‌ను కొడ‌దామ‌ని ఆలోచిస్తున్నట్టుగా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీను పోస్ట్ పోన్ చేసి ఆర్ధికంగా కొంత వ‌ర‌కూ న‌ష్టపోయిన దిల్‌రాజు, ఆ మూవీను ఇంకా పోస్ట్‌పోన్ చేసే అవ‌కాశాలు ఎట్టి ప‌రిస్థితుల్లో ఉండ‌వ‌ని కొంత మంది స్ట్రాంగ్‌గానే చెబుతున్నారు.  

    మాకు అందిన స‌మాచారం మేర‌కు ఎవ‌డు రిలీజ్‌ను డిసెంబ‌ర్ 19న రిలీజ్ చేయ‌టానికి అన్ని స‌న్నాహాలు జ‌రిగిపోయాయి. ఆ మూవీ పోస్ట్‌పోన్ అంటూ వ‌స్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేద‌ని అధికారికంగా తెలిసిన స‌మాచారం. ప్రస్తుతానికి దిల్ రాజు అఫిషియ‌ల్‌గా చెప్పిన న్యూస్ డిసెంబ‌ర్ 19 కాబ‌ట్టి, మ‌ళ్ళీ మ‌రో రిలీజ్ డేట్ వ‌చ్చేంత వ‌రూ అదే ఫైనల్ రిలీజ్ డేట్ అని అంటున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood