ఏమైనా రామ్ గోపాల్ వర్మ గ్రేట్. కథానాయకులను తన బుట్టలో భలే పడేసుకుంటాడు. వరసగా ఫ్లాప్ లు ఇస్తున్నా మన కథానాయకులు కూడా ఆయన్ని భలే నమ్ముతుంటారు. కనీసం కాంట్రవర్సీతోనైనా సినిమాని ఒడ్డున పడేస్తాడన్న దీమానేమో మరి. తాజాగా మంచు విష్ణుని పట్టేశాడు వర్మ. విష్ణు కథానాయకుడిగా ఓ కామెడీ ఎంటర్టైనర్ ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన కథా చర్చలు సాగుతున్నాయి ప్రస్తుతం. ఈనెల 20న ఆ సినిమాని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
`దేనికైనా రెడీ`, `దూసుకెళ్తా` సినిమాలతో వరస విజయాలు సొంతం చేసుకున్న విష్ణు తాజాగా `పాండవులు పాండవులు తుమ్మెదా` అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఆ వెంటనే రామ్ గోపాల్ వర్మతో సినిమా మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. దాని తర్వాత పూరి జగన్నాథ్ తో ఓ సినిమా ఉంటుందని అంటున్నారు. అది `అసెంబ్లీ రౌడీ` రీమేక్ గా తెరకెక్కుతుందని సమాచారం. మరోపక్క మంచు విష్ణు నిర్మాతగా కూడా బిజీ అవ్వబోతున్నాడు. తన 24 ఫ్రేమ్స్ సంస్థలో ఏడాదికి నాలుగైదు సినిమాలు తీయాలని సన్నాహాలు చేసుకుంటున్నాడు.