కరీనాకపూర్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలేవీ చూడటం లేదు. ఆఖరికి తన కజిన్ రణ్‌బీర్ కపూర్ నటించిన ‘బర్ఫీ’ సినిమాని కూడా చూడలేదంట. బాలీవుడ్‌కి సంబంధించిన ఏ సినిమాలు కూడా చూడాల్సిన అవసరం లేదని భర్త సైఫ్ అలీఖాన్ స్ట్రిక్ట్‌గా చెప్పాడట. అందుకే సినిమాలు చూడటం మానేశానని కరీనాకపూర్ చెప్పేసింది.
సైఫ్ చూస్తే గీస్తే ఇంగ్లీష్ సినిమాలు చూడమని సలహా ఇచ్చాడట. అందుకే అమెరికన్ టీవీ షోలు, సీరియళ్లతో పాటు, అక్కడి చిత్రాలను చూస్తూ గడుపుతుందట కరీనా. ఇలాంటి ఆంక్షలు ఎందుకు పెట్టారని సైఫ్‌ని అడిగితే… “అవి ఆంక్షలు కాదు. రోజూ అవే సినిమాలు చేస్తూ… మళ్లీ అవే సినిమాలను చూడటం ఎందుకు అనేది నా ఉద్దేశం. మన సినిమాలను కాకుండా… ఇతర దేశాల సినిమాలను చూస్తే కొత్త విషయాలు తెలుస్తాయి కదా. అందుకే మేం మన బాలీవుడ్ సినిమాలని చూడటం మానేసి చాలా కాలమైంది. కొత్త విషయాలు తెలుసుకొనేందుకు ఇంగ్లీష్ సినిమాలే చూస్తుంటాం. కరీనాకు కూడా అదే చెబుతుంటాను. తను స్ట్రిక్ట్‌గా ఫాలో అయిపోతుంటుంద” ని చెప్పుకొచ్చాడు సైఫ్.