బొమ్మరిల్లు బొమ్మ జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత దక్షిణాదిన సినిమాలు చేయలేదు. బొమ్మరిల్లు ని '' ఇట్స్ మై లైఫ్ '' పేరుతో హిందీ లో రీమేక్ చేస్తున్నారు. దాంతో పాటు ''రాక్ ద షాదీ'' చిత్రాలలో నటిస్తుంది. తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా అతని సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వం లో కీలక పాత్ర చేస్తోంది. తెలుగు లో చిరంజీవి నటించిన హిట్ చిత్రం ''స్టాలిన్'' హిందీ లో ''జయహో'' పేరుతొ రీమేక్ చేస్తున్నారు. తెలుగులో హిట్టయ్యిన పలు చిత్రాలను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ... విజయాలు సాధిస్తున్నాడు సల్లూభాయ్. స్టాలిన్ లో చిరు సోదరిగా నటించిన ఖుష్బూ పాత్రను హిందీ లో జెనిలియా చేస్తుందట ! కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించారట ! ఈ చిత్రం వచ్చే సంవత్సరం రానుంది.
Saturday, 23 November 2013
Tollywood