రెండు ప్రేమకథలతో ఓ కొత్తగా ప్రజెంట్ చేద్దామనే శ్రీరాఘవ ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పవచ్చు. దర్శకుడిగా శ్రీ రాఘవ తన కథ సరియైన రీతిలో ప్రజెంట్ చేయకపోవడం ఒక వైఫల్యమైతే.. పేలవమైన కథ మరో మైనస్ పాయింట్. ప్రేక్షకులు ఏ విధంగా సంతృప్తి చెందుతారు అనే ప్రశ్నను ముందు దర్శకుడి వేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారా అనే సందేహం వెంటాడుతుంది. రెండు గంటలకు పైగా సాగిన ఈ సినిమాలో రెండు నిమిషాలు కూడా ప్రేక్షకుడ్ని మెప్పించలేకపోయాడని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని చూసే ప్రేక్షకుడికి అనుక్షణం చిత్రహింస, అసహనాన్ని లెక్కలేనంతగా దర్శకుడు పంచిపెట్టారనడానికి వెనుకాడనవసరం లేదు. ఇంతకంటే ఈ చిత్రం గురించి ఏమి చెప్పలేం.