ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 22 November 2013

    తలా తోకా లేని వర్ణ

    తలా తోకా లేని వర్ణ, Varna Minus Points, Varna Failure, No Story in Varna, Varna Review
    సుమారు 65 కోట్ల వ్యయంతో తమిళంలో రూపొందిన 'ఇరందామ్ ఉల్గమ్' చిత్రం తెలుగులో 'వర్ణ'గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుష్క శెట్టి, ఆర్య జంటగా శ్రీరాఘవ దర్శకత్వంలో పీవీపీ బ్యానర్ పై పొట్లూరి వి ప్రసాద్ వర్ణ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ ప్రారంభానికి ముందే అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ఎట్టకేలకు చిత్ర నిర్మాణాన్ని పూర్టి చేసుకుని 'వర్ణ'గా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలుసుకునేందుకు ఓ సారి కథలోకి వెళ్తాం.

    ఎవరిని ప్రేమించాం, ఎందుకు, ఎలా, ఎన్నాళ్లు ప్రేమించామనేది ముఖ్యం కాదు. ప్రేమిస్తున్నామా అనేదే ముఖ్యమనే పాయింట్ 'వర్ణ'గా రూపొందింది. ఈ పాయింట్ ఆధారంగా చేసుకుని రెండు లోకాల్లో రెండు జంటల మధ్య నడిచిన ప్రేమ కథలను ఈ చిత్రంలో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. మహిళను ఓ బానిసగా, విలాసవస్తువుగా చూసే మరో లోకంలో వర్ణ ఒక బానిసను మహేంద్ర అనే యోధుడు ప్రేమిస్తుంటాడు.  వర్ణ ఇష్టానికి వ్యతిరేకంగా మహేంద్ర బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు. అయితే తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి జరగడంతో వర్ణ ఆత్మహత్యకు పాల్పడుతుంది.

    ఇక మరో కథలో మధు అనే సోషల్ వర్కర్ ను రమ్య అనే డాక్టర్ ప్రేమిస్తుంది. రమ్య ప్రేమను మధు నిరాకరిస్తాడు. దాంతో రమ్య నిరాశకు లోనవుతుంది. అయితే రమ్య ప్రేమను నిరాకరించిన మధు తర్వాత అర్ధం చేసుకుని ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత రమ్యను కన్విన్స్ చేసి పెళ్లి చేసుకుందామనుకున్న తరుణంలో రమ్య ప్రమాదంలో మరణిస్తుంది. వర్ణ ఆత్మహత్య ప్రయత్నం.  రమ్య ఊహించని విధంగా మరణించడం ఇంటర్వెల్ వరకు సాగిన కథ. అయితే ఆత్మహత్యకు పాల్పడిన వర్ణ ఏమవుతుంది. మహేంద్ర ప్రేమను అంగీకరిస్తుందా? రమ్యను కోల్పోయిన మధు పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలకు జవాబుల కోసం వర్ణ చిత్రం చూడాల్సిందే.

    రెండు ప్రేమకథలతో ఓ కొత్తగా ప్రజెంట్ చేద్దామనే శ్రీరాఘవ ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పవచ్చు. దర్శకుడిగా శ్రీ రాఘవ తన కథ సరియైన రీతిలో ప్రజెంట్ చేయకపోవడం ఒక వైఫల్యమైతే.. పేలవమైన కథ మరో మైనస్ పాయింట్. ప్రేక్షకులు ఏ విధంగా సంతృప్తి చెందుతారు అనే ప్రశ్నను ముందు దర్శకుడి వేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారా అనే సందేహం వెంటాడుతుంది. రెండు గంటలకు పైగా సాగిన ఈ సినిమాలో రెండు నిమిషాలు కూడా ప్రేక్షకుడ్ని మెప్పించలేకపోయాడని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని చూసే ప్రేక్షకుడికి అనుక్షణం చిత్రహింస, అసహనాన్ని లెక్కలేనంతగా దర్శకుడు పంచిపెట్టారనడానికి వెనుకాడనవసరం లేదు. ఇంతకంటే ఈ చిత్రం గురించి ఏమి చెప్పలేం.

    ఈ చిత్రంలో వర్ణ, రమ్య అనే పాత్రల్లో అనుష్క, మధు, మహేంద్ర అనే పాత్రలో ఆర్య కనిపించారు.విసిగెత్తించే కథలో అనుష్క, ఆర్యలు చేయాల్సిందేమి లేకపోయింది. అనుష్క, ఆర్యలు జంటగా మరో చిత్రంలో నటించారని సినీ చరిత్రలో మిగిలిపోతారు. యోధుడిగా ఆర్య సిక్స్ ప్యాక్ కూడా బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలింది. ఈ నాలుగు పాత్రలు తప్ప వర్ణలో రిజిస్టర్ అయ్యే మరో పాత్ర కనిపించదు. అందమైన లోకేషన్లు, రాంజీ కెమెరా పనితనం బాగున్నాయి. హరీస్ జైరాజ్ సంగీతం ఆకట్టుకునే విధంగా లేదు. అనిరుధ్ రవిచంద్రన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ పర్వాలేదనిపించింది. కథలోనే లొసుగులు ఉండటంతో టెక్నిషియన్ల ప్రతిభ కూడా మరుగున పోయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. భారీ బడ్జెట్ తో తలా తోకా లేకుండా రూపొందిన వర్ణ నిరాశపరిచించింది.

    Tollywood

    Bollywood

    Kollywood