ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here

Wednesday, 27 November 2013

ఆధునిక హంగుల‌తో ప‌వ‌న్ ఆఫీస్!

ఆధునిక హంగుల‌తో ప‌వ‌న్ ఆఫీస్
ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్మాత‌గా బిజీ అవ్వ‌బోతున్నాడు. త్రివిక్ర‌మ్‌తో క‌లిసి సినిమాలు నిర్మించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. తొలుత ఇద్ద‌రూ క‌లిసి ‘కోబ‌లి అనే సినిమా చేస్తారు. ఆ త‌ర్వాత యువ‌తరం ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హిస్తూ కాన్సెప్ట్ సినిమాల‌ను తీయ‌బోతున్నారు. అందుకోసం ఆఫీసును కూడా సిద్ధం చేశారు.

జూబ్లీహిల్స్ లో ఓ ప్రత్యేక కార్యాల‌యం ఏర్పాటు చేసుకొన్నారు. ఆధునిక హంగుల‌తో ఆ ఆఫీసును సిద్ధం చేశారు. ఇక నుంచి ప‌వ‌న్ కార్య‌కలాపాల‌న్నీ అక్కడ్నుంచే సాగుతాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌స్తుతం ‘గ‌బ్బ‌ర్‌సింగ్ 2' చిత్రం తెర‌కెక్కుతోంది. ఆ సినిమా కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోంది. అందుకు సంబంధించిన ప‌నులు కూడా ఈ కొత్త ఆఫీసు ద్వారానే సాగబోతున్నాయి.సంపత్ నంది దర్శకత్వం వహించే ఈ చిత్రానికి శరత్ మరార్ నిర్మాత. డిసెంబ‌రు నుంచి ‘గ‌బ్బ‌ర్‌సింగ్‌2' చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది.

Post Comments

No comments:

Post a Comment