‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్నాడు శ్రీకాంత్ అడ్డాల. విజయాలొచ్చినా ఏమాత్రం తొందర పడకుండా, నిదానంగా సినిమాలు చేస్తున్నాడీ దర్శకుడు. ఈ క్లాస్ దర్శకుడికి పవన్ కల్యాణ్ నుంచి పిలుపు కూడా వచ్చింది. నిజానికి ‘సీతమ్మవాకిట్లో’ కథ ముందు పవన్ కే వినిపించాడు. మహేష్ బాబు పోషించిన చిన్నోడు పాత్రని పవన్ చేయాల్సింది. కానీ తన కాల్షీట్లు సర్దుబాటు చేయలేక ఈసినిమా వదులుకొన్నాడు. అయినా శ్రీకాంత్ దర్శకత్వ నైపుణ్యం మీద నమ్మకం ఉంచిన పవన్.. శ్రీకాంత్ కి ఆఫర్ ఇచ్చాడు. పవన్ కల్యాణ్, పీవీపీ సంస్థతో ఓ సినిమా చేస్తానని ఒప్పందం కుదుర్చుకొన్నాడు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తారని చెప్పుకొన్నారు. పవన్, శ్రీకాంత్ అడ్డాల మధ్య కథాచర్చలు కూడా జరిగాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీకాంత్ అడ్డాల డ్రాప్ అయినట్టు సమాచారమ్. ఎందుకంటే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తో శ్రీకాంత్ ఓ సినిమా కమిట్ అయ్యాడు. అది పూర్తవ్వాలంటే కనీసం యేడాది ఆగాలి. కానీ పీవీపీ సినిమా వచ్చే యేడాది మొదలెట్టాలి. అందుకే నావల్ల కాదు.. అంటూ తప్పుకొన్నాడట. ఇప్పుడు పీవీపీ సంస్థ పవన్ కోసం మరో దర్శకుడిని అన్వేషించుకొంటోంది. మరి ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.
Wednesday, 27 November 2013
Tollywood
No comments:
Post a Comment