వరుసగా ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా స్టార్ హీరో గానీ, డైరెక్టర్ గానే న్యూ ప్రాజెక్ట్ చేస్తుంటే ఎలాగోలా ఆ సినిమాకు హైప్ తెచ్చేస్తారు. 10 ఏళ్ళ క్రితం ఒక్కడు నుండీ ఇంతవరకు సరైన హిట్ లేని " సెట్స్ స్పెషలిస్ట్ " డైరెక్టర్ గుణశేఖర్ భారీ వ్యయంతో రుద్రమదేవి ని స్వయంగా నిర్మిస్తున్నాడు. అంత బడ్జెట్ మూవీకి గుణ ఫండ్స్ ఎలా సర్దుబాటు చేస్తోందీ ఇండస్ట్రీ టాక్ గా ఉన్నా మహేష్ బాబు తో ఎలాగైనా గెస్ట్ రోల్ చేయించి సినిమాకు బిజినెస్ పెంచే బిజీలో ఉన్నాడు. ఆ రోల్ మహేష్ చేస్తున్నట్టు వార్తలు వచినా అది కష్టమే అని సేఫ్ గా రవితేజ ను ఒప్పించాడని కొత్తగా వినిపిస్తోంది. నిప్పు మూవీతో రవితేజ కు తిరుగులేని ఫ్లాప్ అందించిన గుణ కు రవితేజ గెస్ట్ రోల్ ఎలా చేస్తాడని డౌట్స్ వస్తున్నా కెరీర్ బిగినింగ్ డేస్ లో రూమ్మేట్స్ అయిన ఫ్రెండ్షిప్ తో మహేష్ కాదంటే రవితేజ తో చేయిస్తాడని టాక్.
Sunday, 17 November 2013
Tollywood