తెలుగులో ఓ సినిమా, తమిళ్‌లో ఒక సినిమా, హిందీలో ఓ సినిమా .. చేస్తూ హైదరాబాద్, చెన్నయ్, ముంబై మూడు నగరాల్లో తన హవా కొనసాగిస్తోంది. మూడు భాషల్నిగుప్పిట్లో బంధించేసింది తమన్నా భాటియా. ఇక్కడో సినిమా, అక్కడో సినిమా చేస్తూ మూడుముక్కలాట ఆడుతోంది. ఇటీవలే మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆగడు’ చిత్రానికి ఎంపికైంది.
ప్రస్తుతం తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న ఏకైక చిత్రమిది. అదేగాక తమిళ్‌లో ‘వీరం’ అనే సినిమాలో నటిస్తోంది. హిందీలో ‘ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్’లో నటిస్తోంది. అయితే తడాఖా తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల్లో నటించాలంటే బాగా ఆలోచిస్తోంది. స్టార్ హీరో అయితేనే ఒప్పుకుంటోంది. మహేష్ కాబట్టే ఆగడుకి సంతకం చేసింది. అయితే ఇటీవల గోపీచంద్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాలో నటిస్తోం దంటూ వార్తలొచ్చా యి.
వీటిని తమన్నా తోసిపుచ్చింది. మేనేజర్ ద్వారా ఓ విషయం బైటికి చెప్పించింది ఈ భామ. నేను గోపీచంద్‌తో నటించడం లేదు. ప్రస్తుతం నా ప్రాధాన్యత ఆగడు సినిమాకి మాత్రమే. ఈ సినిమాకి పెద్ద మొత్తంలో కాల్షీట్లు సర్ధుబాటు చేశాను. నా దృష్టంతా ఇక ఈ సినిమాపైనే.. అంటూ చెప్పుకొచ్చింది. దీనిని బట్టి ఒకేసారి మూడు భాషల్లో సినిమాలకు ఏ ఆటంకం లేకుండా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటోందని అర్థమవుతోంది కదూ!