ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 23 November 2013

    బాలికపై ముగ్గురు బాలుర అత్యాచారం

    బాలికపై ముగ్గురు బాలుర అత్యాచారం
    వరంగల్‌ : రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన తగాదాలు కక్షగా మారి అది చివరకు ఓ బాలిక అత్యాచారానికి గురైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో  స్థానికంగా నివాసం ఉంటున్న ఇరు కుటుంబాల మధ్య తగాదాలు ఉండటంతో.... ఒక కుటుంబానికి చెందిన పిల్లలు... మరొక కుటుంబం వారిని ఎలాగైనా అభాసుపాలు చేయాలని పథకం వేశారు.  ఆ కుటుంబంలోని అమ్మాయితో స్నేహాన్ని నటిస్తూ, ఆమెను మభ్యపెట్టి తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు.

    అంతేకాకుండా.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేస్తుండగా మిగిలినవారు ఆ ఘటనను సెల్ ఫోన్లలో కూడా చిత్రీకరించారు. అనంతరం సెల్ ఫోన్లలో స్నేహితులకు పంపిస్తున్న విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక డీఎస్ పీ సరిత మాట్లాడుతూ నిందితులపై నిర్బయ, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

    Tollywood

    Bollywood

    Kollywood