ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 14 November 2013

    ఫ్యామిలీ మొత్తం ఎస్ అనాల్సిందేనా!

    ఫ్యామిలీ మొత్తం ఎస్ అనాల్సిందేనా
    ఓ సినిమా చేయాలా వద్దా అన్నది హీరో డిసైడ్ చేసుకుంటాడు. కథలో మార్పులు అవసరమైతే అతడే చెబుతాడు. కానీ మెగా హీరోల విషయంలో అలా జరగదు. ఏ హీరో కథ ఓకే చేయాలన్నా ఫ్యామిలీ మొత్తం ఇన్ వాల్వ్ కావాల్సిందే.

    చిరంజీవి విషయంలో నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఎవరూ లేరు. అతడే సుప్రీమ్. ఎందుకంటే అతడి వెనకాల మరో హీరో లేడు కాబట్టి. కానీ ఆయన తర్వాత వచ్చిన వాళ్లందరికీ ఆయన వెనకున్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు చిరుయే అతడికి సలహాదారు. అతడు కథ విని ఓకే చేశాకే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవాడని అంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అదే జరుగుతోందనేది అందరూ అనే మాట.

    ఇప్పుడు వరుణ్ తేజ సినిమా విషయంలో కూడా చిరుదే ఫైనల్ నిర్ణయమని తెలిసింది. శ్రీకాంత్ అడ్డాల చేతికి నాగబాబు కొడుకును అప్పగించాడే గానీ... ఏ కథ సినిమా అవ్వాలన్నది చిరుయే చెప్పారట. శ్రీకాంత్ తెచ్చిన కథను విని, అందులో మార్పులు చేయించి మరీ చిరు ఓకే అన్నారని వినికిడి. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇన్ వాల్వ్ అయ్యాడని, అతడు కూడా మార్పులూ చేర్పులూ చెప్పాడని అందరూ అంటున్నారు.

    ఇలా ఫ్యామిలీ మొత్తం కలిసి కథలు డిసైడ్ చేయడం బహుశా మరెక్కడా ఉండదేమో కదూ. అయినా ఇవన్నీ ఎవరో చెబుతున్న మాటలు తప్ప, దర్శకులెవరూ ఈ విషయాన్ని చెప్పలేదు. మరి నిజంగానే వాళ్లు అంతగా ఇన్ వాల్వ్ అవుతున్నారా లేక ఇది కావాలని ఎవరో పుట్టిస్తున్నారా అన్నది మనకైతే తెలీదు. అయినా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే... నిప్పు లేకుండా పొగ రాదనే చిన్న లాజిక్కుతో!

    Tollywood

    Bollywood

    Kollywood