జల్సా, గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది.... ఇలా పవన్ కల్యాణ్ - దేవిశ్రీ ప్రసాద్‌ల కాంబినేషన్ హ్యాట్రిక్ అందుకొంది. ఈ సినిమా ఘన విజయాల్లో దేవిశ్రీ ప్రసాద్ పాత్ర మర్చిపోలేం. అందుకే గబ్బర్ సింగ్ 2కీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది అనుకొన్నారంతా. అయితే ఈసారికి దేవిశ్రీ ప్రసాద్‌ని పక్కన పెట్టాలని పవన్ నిర్ణయించుకొన్నట్టు సమాచారమ్. వరుసగా సినిమాలు చేస్తే మోనాలిటీ వచ్చేస్తుందని పవన్ భయపడుతున్నాడట. అందుకే దేవిశ్రీ స్థానంలో మరో సంగీత దర్శకుడిని తీసుకోవాలని డిసైడ్ అయినట్టు టాక్. దానికి తోడు గబ్బర్ సింగ్‌కి పనిచేసిన ఏ టెక్నీషియన్‌నీ సీక్వెల్‌లో కొనసాగించకూడదనే నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది. అందుకే ఇప్పుడు మరో సంగీత దర్శకుడి కోసం అన్వేషిస్తున్నారు. ఆ అవకాశం మణిశర్మకే దక్కే అవకాశాలున్నాయని టాక్..!
Sunday, 17 November 2013
Tollywood