నాగచైతన్య వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ఎన్నాళ్లనుంచో పూర్తి కాకుండా ఆగిపోయిన ఆటో నగర్‌ని ముందుకు కదిలించాడు. ఆసినిమా ఇప్పుడువిడుదలకు సిద్ధమైంది. డిసెంబరుతో మనం షూటింగ్ కూడా పూర్తయిపోతుంది. అదే నెలలో మరో కొత్త సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి కసరత్తులు చేస్తున్నాడు. నాగచైతన్య, శ్రీనివాసరెడ్డి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. సి.కల్యాణ్ నిర్మాత. హన్సిక కథానాయికగా నటించనుంది. డిసెంబరు 1నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ''వినోదం. యాక్షన్ గలగలిపిక కథ ఇది. చైతూ పాత్ర రెండు విభిన్నమైన కోణాల్లో సాగుతుంది'' అని చిత్రబృందం చెబుతోంది. చైతూ. శ్రీనివాస రెడ్డి కలయికలో హలో బ్రదర్ రీమేక్ సినిమా వస్తుందని అనుకొన్నారు. స్ర్కిప్టు పూర్తయి కథానాయికల ఎంపిక కూడా జరిగిపోయిన తరవాత ఆ చిత్రం అటకెక్కేసింది. ఆ స్థానంలో మొదలుకానున్నచిత్రమిది. మరి ఈ సినిమా అయినా సవ్యంగా నడుస్తుందో లేదో...?
Sunday, 17 November 2013
Tollywood