తెలుగులో పలు చిత్రాల్లో నటించి ఇటీవలి కాలంలో తెలుగుకు తెరకు కనుమరుగు అయిన హీరో సచిన్ జోషి ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. ప్రస్తుతం ఇతను శ్రుంగార తార సన్నీలియోన్ తో కలిసి ‘జాక్ పాట్ ’ అనే బాలీవుడ్ సినిమాలో నటించాడు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
ఈ సినిమా ప్రమోషన్ లో సచిన్ జోషి ఇప్పటి వరకు ఎంతో మందితో తెర పై రొమాన్స్ చేశాను కానీ, శ్రుంగార తార సన్నీతో తెర పై రొమాన్స్ బాగా ఎంజాయ్ చేశానని, మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని, సన్నీ కేవలం అందాల ప్రదర్శనే చేస్తుందనుకున్నాను కానీ ఆమె నటన కూడా అద్భుతం అని, నటనలో ఆమె చూపే ప్రొపెషనలిజాన్ని చూసి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చాడు.
సన్నీలియోన్ ‘జాక్‌పాట్’తో అందాల పరంగా, నటన పరంగా బాగా స్కోర్ చేస్తుందని సన్నీలో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు. సచిన్ పొగడ్తలతో సన్నీలియోన్ తడిసి ముద్దవ్వడమే కాకుండా, మరో ఛాన్స్ ఇవ్వడానికి ఆమె కూడా రివర్స్ లో తెగ పొగిడేసింది.. సచిన్ గొప్ప నటుడనీ, ఈ సినిమాలో నన్ను పెట్టుకున్నందుకు ఆయనకు రుణపడి ఉంటానని చెప్పుకొచ్చింది.
మరి సన్నీతో తెర పై సచిన్ ఆడిన సరసాలు ఏమాత్రం రక్తి కట్టించాయో తెలియాలంటే ‘జాక్ పాట్ ’ సినిమా విడుదల కావాల్సిందే.

No comments:
Post a Comment