ఎక్కడ చెక్కెర ఉంటుందో అక్కడ చీమలుంటాయ్... ఇదెంత నిజమో సక్సెస్ ఎక్కడుంటే బండ్లగణేష్ అక్కడుంటాడు అనేది కూడ అంతే నిజం అంటున్నారు. ఔను, మిర్చి డైరెక్టర్‌ని తన తరువాత ప్రాజెక్ట్ కోసం 2 కోట్లు ఇచ్చి అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న బండ్లగణేష్ ఇప్పుడు లేటెస్ట్‌గా మరో డైరెక్టర్‌పై కర్ఛీఫ్ వేసేశాడని టాక్.
వెల్, ఈ విషయం ఏంటంటే... గోపీచంద్-తాప్సీ జంటగా తెరకెక్కిన చిత్రం సాహసం. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతుండగా ఇటీవలే ఈ సినిమా ట్రైలర్స్‌ని విడుదల చేశారు. ఇవి ఇన్స్‌టెంట్ హిట్ అవ్వడంతో బండ్లగణేష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కి దర్శకుడిగా చంద్రశేఖర్ ఏలేటిని ఎంచుకున్నాడు.
సాహసం సినిమా విడుదల కాకుండానే చంద్రశేఖర్‌పై ఉన్న నమ్మకంతో బండ్లగణేష్ అడ్వాన్స్ బుకింగ్ చేసేసుకున్నాడు. మొత్తానికి, సక్సెస్ కోసం బండ్లగణేష్ ఎంత దూరమైన వెళతాడు, ఎంతైన ఖర్చు పెడతాడు.