సాధారణంగా హీరోలను మోసేస్తుంటారు కథానాయికలు. అబ్బో.. ఆ హీరోతో కలిసి నటించడం మా అదృష్టం అంటూ బిల్డప్‌లు ఇస్తుంటారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఫలానా కథానాయిక నా ఫేవరెట్ అని హీరోలు చెప్పుకొంటున్నారు. ఈ జాబితాలో బన్నీ కూడా చేరాడు. బన్నీకి ఇష్టమైన కథానాయిక మరెవరో కాదు.. కాజల్. ఆమెతో నటించడం ఎప్పుడూ ఆస్వాదిస్తాడట. ఆర్య 2లో ఇద్దరూ జత కట్టారు.
ఇప్పుడు ఎవడు సినిమాలోనూ ఇద్దరూ జోడీగానే కనిపించనున్నారు. అందుకనే నేమో... కాజల్‌ని తెగ మోసేస్తున్నాడు బన్నీ. కాజల్ నా బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చెబుతున్నాడు. సుకుమారుడు ప్లాటినమ్ డిస్క్ వేడుకకి బన్నీ అతిథిగా వచ్చాడు. ఈ సినిమాలో కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కథానాయిక. ఈ సందర్భంగా చెల్లెలు ముందు అక్కని తెగ పొగిడేశాడు అల్లు అర్జున్. ఈ కాకా వెనుక ఉన్న కథేమిటో మరి?!