నాయక్, బాద్‌షా... ఈ ఏడాది టాలీవుడ్‌లో 40 కోట్ల పైచిలుకు వసూళ్లను రాబట్టిన సినిమాలు. ఈ రెండు సినిమాల్లోనూ కథానాయిక కాజల్. ఈ ఏడాది రెండు భారీ విజయాలు సాధించిన కాజల్ చేతుల్లో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది. రామ్‌చరణ్‌తో ‘ఎవడు’లో నటిస్తున్నారు. దానికి కారణం ఈ ముద్దుగుమ్మ పారితోషికాన్ని అమాంతం పెంచేయడమే అనేది టాలీవుడ్ టాక్.
కేవలం పారితోషికం కారణంగానే భారీ ప్రాజెక్టులనే చేజార్చుకున్నారట కాజల్. ఈ విషయం గురించి కాజల్ ముందు ప్రస్తావిస్తే-‘‘ఒక పద్ధతి ప్రకారం నా కెరీర్‌ని డిజైన్ చేసుకున్నాన్నేను. తెలుగులో ఎక్కువ సినిమాలు అంగీకరించకపోవడానికి కారణం తమిళంలో ముందు ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికే. ప్రస్తుతం అక్కడ కార్తీతో ‘ఆల్ ఇన్ ఆల్ అళగురాజా’, విజయ్‌తో ‘జిల్లా’ చిత్రాల్లో నటిస్తున్నాను.
రెండూ ప్రెస్టేజియస్ ప్రాజెక్టులే. తెలుగులో ‘ఎవడు’ ఉండనే ఉంది. ఇక నేను ఖాళీగా ఎక్కడున్నట్టు? ఓ సినిమా అంగీకరించడానికి కారణాలున్నట్టే, వదులుకోవడానికి కూడా కారణాలుంటాయి. ఆ కారణాలు అందరికీ చెప్పాల్సిన పని లేదు. ఒక్కటి మాత్రం ఘంటాపథంగా చెప్పగలను. నాకు పాత్ర ముఖ్యం. డబ్బు మాత్రం కాదు’’ అని సూటిగా స్పందించారు.