పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో పక్కన నటించే అవకాశం వస్తుందంటే ఎవరు మాత్రం వదులుకొంటారు? ఎగిరి గంతేసి మరీ... ఒప్పేసుకొంటారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. పవన్ సినిమాకి కథానాయికల కొరత వచ్చింది. గబ్బర్ సింగ్ 2లో పవన్ పక్కన భామను ఎంచుకోవడానికి చిత్రబృందం అష్టకష్టాలూ పడుతోంది. కొంతమంది పారితోషికాలతో భయపెడుతున్నారు. మరి కొంత మందికి ఖాళీ లేదు.
దాంతో... పవన్ పక్కన జోడీ కట్టే కథానాయిక ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమయ్యింది. కాజల్‌ని సంప్రదిస్తే.. ఏకంగా కోటిన్నర పారితోషికం అడిగిందట. సమంత కాల్షీట్లు ఖాళీ లేవు. సోనాక్షి సిన్హా కూడా తెలుగు సినిమాలవైపు ఆసక్తి చూపించడం లేదు. తెలుగులో కథానాయిక కొరత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా?