ప్రభుదేవా నయనతార ప్రేమాయం ఒక ట్రాజెడి. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న రోజుల్లో మీడియాకు ఒకటే న్యూస్. విడిపోయిన తరువాత కూడ అదే న్యూస్. తాజాగా నయన,ఆర్య మ్యారేజ్ అంటూ వచ్చిన పుకార్లు నయనతార మూవీ ప్రమోషన్లోని భాగమే అని తెలుసుకొని జనాలు ముక్కున వేలువేసుకున్నారు.
అయితే ప్రభుదేవా,నయనతార ఇద్దరూ విడిపోయిన తరువాత , ఇదే ఇష్యూను సానుభూతిగా వాడుకుంటుంది నయన. ఇందుకు ప్రత్యేక నిదర్శణం లేటెస్ట్ మూవీ రాజా-రాణి. ఆర్య తో పెళ్ళి వార్తలు ఇండస్ట్రీలో ఎగసిపడుతున్నా తను మాత్రం ఏమి తెలియనట్టుగా కూల్‌గా ఉండిపోయింది. ఇదే టాపిక్ తన దగ్గరకు తీసుకువెళ్ళిన జర్నలిస్టులుకు ఏమాత్రం సమాధానం ఇవ్వకుండా తన టెక్కును చూపించుకుంది.
ఏదైతేనేం ప్రభుదేవాతో చేసుకున్న తెగదెంపులు నయనతారాకు బాగాకలిసివచ్చేలా ప్లాన్స్ చేసుకుంటుంది. రాజా-రాణి ప్రమోషన్ విషయం ముందుగా నయనతారాకు చెప్పారట. వీటికి నో చెప్పకుండా మీ ఇష్టం అంటూ సమాధానం ఇచ్చుకుంది. ఇదంతా సానుభూతిని చూపించుకుంటూ మార్కెట్లో ఎఫైర్‌ను క్యాష్ చేసుకోవడమే అని కోళీవుడ్ అంటుంది.