వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ పేరు రాష్ర్టంలో ఇప్పుడు సంచలనం. ఆయనకు సంబంధించిన ఏ వార్త వచ్చినా హాట్ టాపికే అవుతుంది. టీవీలో ఆయనకు సంబంధించిన న్యూస్ వస్తుంటే జనాలు విరగబడి చూస్తున్నారు. అయితే జగన్ కు సంబంధించిన మరో బ్రేకింగ్ త్వరలోనే రాబోతోంది. అంతర్గత సమాచారం ప్రకారం.. జగన్ ఈ మధ్య చాలా లావు పెరిగినట్లు తెలుస్తోంది.
జగన్ ను రాష్ర్ట ప్రజలు (టీవీల్లో) చూసి చాలా కాలం అవుతోంది. జైల్లో ఉన్న జగన్ ఎలా ఉన్నాడో చాలామంది తెలియదు. ఆయన చివరిసారి కనిపించి కొన్ని నెలలు గడిచింది. అందుకే జగన్ ను చూడాలని అభిమానులు ఉవ్వీళ్లూరుతున్నారు.
ఈ నేపథ్యంలో అభిమానుల కోరిక అతి త్వరలోనే ఇలా తీరనుంది. జైల్లో ఉన్న జగన్ ను జూన్ 7న కోర్టుకు రావాల్సిందిగా కోర్టు ఆదేశించింది. జైలు అధికారులకు కూడా ఆదేశాలు వెళ్లాయి. ఇందులోనూ ఎ-1 అయిన జగన్ జూన్ 7న జనానికి కనిపించనున్నారు. అయితే జగన్ ఈ మధ్య చాలా లావు పెరిగిట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే గనక నిజమైతే రెండు మూడు రోజుల పాటు రాష్ర్టంలో ఇదో హాట్ టాపిక్ కావడం ఖాయం.
హోంమంత్రి కూడా
హోంమంత్రి సబితకు సీబీఐ సమన్లు జారీ చేసింది. దాల్మియా సిమెంట్‌పై చార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సబిత సహా మరో 12మంది నిందితులకు సమన్లు జారీ అయ్యాయి. జూన్ 7 తేదిన తమ ముందు హాజరుకావాలని సీబీఐ ఆదేశాలు జారీ చేసింది.