కేంద్ర మంత్రి పవన్‌కుమార్ భన్సాల్ పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. దానికి కారణం అతని మేనల్లుడే. మేనమామ అధికారాన్ని అడ్డంపెట్టుకుని 12 కోట్ల రూపాయలకు రైల్వే శాఖలో ఓ పదవిని బేరం పెట్టగా ఆ బాగోతం బయటపడింది. మేనల్లుడితో బన్సాలే ఆ పని చేయించి ఉంటారని అనుమానాలు కలిగాయి అందరిలోనూ. చేసేది లేక కాంగ్రెసు పార్టీ బన్సాల్‌తో రాజీనామా చేయించింది. రాజీనామా లేఖను ప్రధానికి బన్సాల్ అందజేశారు. ఇంకో మంత్రి అశ్విని కుమార్ కూడా పదవికి రాజీనామా చేశార్ట. సిబిఐని ప్రభావితం చేసేలా వ్యవహరించారని ఈయనపై ఆరోపణలు వచ్చాయి.
అశ్వినికుమార్ పదవి పోవడం అటుంచితే, వ్యవహారికంలో 'మేనల్లుడి గండం' అంటాము. అదే ఆ గండమే బన్సాల్‌ని పదవికి దూరం చేసింది. చాలా ఏళ్ళ తర్వాత కాంగ్రెసు పార్టీకి రైల్వే శాఖ మంత్రి పదవి దక్కింది. మిత్ర పక్షాలకు ఇన్నాళ్ళూ ఆ పదవి కట్టబెట్టిన కాంగ్రెసు పార్టీ ఇప్పుడేమి చేస్తుందో చూడాలిక.