14 సంవత్సరాల క్రితం పెళ్ళిచేసుకున్నారు. పెళ్ళి చేసుకునేటప్పుడే ఇద్దరికి అగ్రిమెంట్ కుదిరింది. పెళ్ళి తరువాత 14 సంవత్సరాలకి మనం ఇద్దరం ఇష్టపూర్వకంగా విడిపోదాము. దీనికి మేం ఇద్దరం అంగీకరిస్తున్నాం. అంటూ ఆ అగ్రిమెంట్ సారాంశం. ఆ విధంగానే రీసెంట్‌గా వారిద్దరూ విడిపోయారు. వారిద్దరే హాలీవుడ్ యాక్ట్రెస్ 'మోనిక బెల్లూసి', 'విన్సెంట్ కాస్సెల్'. రీసెంట్ 1990 నుండి వీరిద్దరి ఫిల్మ్ కెరీర్ స్టార్ అయింది. ఆనాటి నుండి నేటి వరకూ ఎన్నో హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. 'మోనిక బెల్లూసికి' నలభై ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఈమె కంటే రెండు సంవత్సరాలు చిన్న 'విన్సెంటె కాస్సెల్'. ఇప్పుడు వీరిద్దరూ అఫిషియల్‌గా విడిపోయిన తరువాత కూడ ఇద్దరం ఒకరికొకరం కలిసి ఉండటానికి ఇబ్బందేమి లేదంటున్నారు. అలాగే మాకు నచ్చిన వారితో మేము ఎంజాయ్ చేస్తాం అంటున్నారు.
Tuesday, 27 August 2013
Movie News