ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 27 August 2013

    భార్యతో గొడ‌వ‌, ప‌రారైన హీరో

    భార్యతో గొడ‌వ‌, ప‌రారైన హీరో
    రీల్‌లైఫ్‌లో విల‌న్ క్యారెక్టర్లు చేసిన ప్రసిద్ద న‌టుడు, రియ‌ల్ లైఫ్‌లోనూ విల‌న్‌గా మారాడు. అంతేకాకుండా రెండు సార్లు జాతీయ అవార్డు గ్రహీతగా అవార్డుల‌ను అందుకున్నాడు. త‌నే ఓంపురి. ఓంపురిపై ఇప్పుడు డొమోస్టిక్ వ‌య‌లెన్స్ కేసు న‌మోదు అయింది. త‌న‌ని హింసిస్తున్నాడ‌ని త‌న భార్య నందిత పురి కేసు పెట్టింది. దీంతో ఈ టాపిక్ బాలీవుడ్ హాట్ టాపిక్ అయింది. నందిత పురిని ప్రేమించి పెళ్ళిచేసుకున్న ఓంపురికి గ‌త కొంత కాలంగా వీరిద్దరి మ‌ధ్య మ‌న‌స్పర్ధలు ఏర్పడుతున్నాయంట‌. 2009లో ఇలాగే ఒక‌సారి ఓంపురి మీద కేసు న‌మోదు అయింది. అయితే పెద్దల జోక్యంలో ఇద్దరూ ఒక‌రికొక‌రు క‌లిసిపోయారు. మ‌ళ్ళీ ఈనాడు ఓంపురిపై డొమోస్టిక్ వ‌య‌లెన్స్ కేసును నందిత పెట్టింది.

    ఇప్పుడు ఓంపురి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. నందిత ఓ జ‌ర్నలిస్టు, ర‌చ‌యితగా ఫేమ‌స్ అయింది. నందిత చేస్తున్న ఆరోప‌న‌లు ఎంత‌ వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే ఓంపురి సమాధానాం చెప్పుకోవ‌ల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఈసారి వీరిద్దరి మ‌ధ్య వ‌చ్చిన గొడ‌వ పెద్దదిగా మారే అవ‌కాశం ఉందంటున్నారు. ఓంపురిపై నందితే కాకుండా మ‌రి కొన్ని సెక్సువ‌ల్ హ‌రాష్‌మెంట్స్ కేసులు న‌మోదు అయ్యాయి. ఆగ‌ష్టు 23న నందిత, త‌న భ‌ర్తపై ఈ కేసును న‌మోదు చేసింది.

    Tollywood

    Bollywood

    Kollywood