ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 3 August 2013

    సమైక్య ఉద్యమానికి సం'కుల'సమస్యలు

    Caste Politics For Seemandhra Agitation
    హారాహొరీగా సాగుతున్న సమైక్య ఉద్యమంలో సంకుల సమస్యలు తలెత్తుతున్నాయా? కాపులు, బిసిలు ప్రత్యేక రాష్ట్రాల వైపే మొగ్గు చూపుతున్నారా?  ఇన్నాళ్లుగా సాధ్యపడని రాష్ట్రసారథ్యం ఈ విధంగా చేతికందుతుందని వారు భావిస్తున్నారా? పరిస్థితులు చూస్తుంటే, అవుననే అనిపిస్తోంది.  రాష్ట్రంలో కాపులు, బిసిలది సంఖ్యాపరంగా పైచేయి అయినా, ఇన్నాళ్లూ  ఇటు కాంగ్రెస్, అటు తెలుగుదేశం ఆధ్వర్యంలో వీలయినంత వరకు అగ్రవర్ణాలు లేదా, ఎస్ సిలు మాత్రమే ముఖ్యమంత్రులుగా వుంటూ వస్తున్నారు. గతంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా కాపులకు అధికార పగ్గాలు అందడం లేదు. కాపునాడు , ప్రజారాజ్యం వంటి వ్యవహారాలు కాపుల ప్రాముఖ్యతను పెంచాయి తప్ప, అధికారం అందించలేదు.

    ఇప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే కాంగ్రెస్ కు అధికారం అందుతుందా..అందదా అన్న సంగతి పక్కనపెడితే, ముఖ్యమంత్రి పదవికి పోటీ పడే అవకాశం కాపులకు లేదా బిసిలకు దక్కుతుంది. తెలుగుదేశం ఇప్పటికే బిసిలకు అగ్రస్థానం అని ప్రకటించింది కాబట్టి, కనీసం 70 స్థానలైనా బిసిలకు ఇవ్వాల్సి వుంటుంది. అంటే దగ్గర దగ్గర సగానికి కొంచెం తక్కువ.  దానా దీనా చిన్నరాష్ట్రమైతే, తాము చక్రం తిప్ప వచ్చని కాపులు, బిసిలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.  అందుకే అధిష్టానం మనసెరిగి ప్రవర్తిస్తున్నట్లు కలరింగ్ ఇస్తూ, చిరంజీవి, కిల్లి కృపారాణి, పల్లంరాజు తదితరులు రాజీనామా చేయలేదు.

    ఇదిలా వుంటే, కెవిపి సారథ్యంలో జరిగిన మంతనాల్లో కూడా ఇదే అంశం చర్చకువచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు సమైక్య రాష్ట్రాన్ని జారవిడుచుకుంటే, అధికారాన్ని కూడా జారవిడుచుకోక తప్పదని అందులో పాల్లోన్న అగ్రవర్ణాలు భావించినట్లు తెలిసింది. ఎలాగైనా ఉద్యమం ఉధృతం చేయాలని, తెలంగాణాను ఈ ఎన్నికల వరకైనా వాయిదా వేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.మొత్తానికి ఇలా సమైక్య ఉద్యమం సం’కుల’సమరంగా మారడం అంటే, చివరకు నీరుగారడమే అవుతుంది.

    Tollywood

    Bollywood

    Kollywood