మై పెట్ నేమ్ గోవిందు. పెన్ నేమ్ భజ గోవిందం. గన్ నేం భజ భజ గోవిందం... అంటూ సందడి చేయబోతున్నాడు మంచు మనోజ్. అయన కథానాయకుడిగా `పోటుగాడు` అనే చిత్రం తెరకెక్కింది. పవన్ వడేయార్ దర్శకత్వం వహించారు. కన్నడ చిత్రం `గోవిందాయ నమః`కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. లగడపాటి శ్రీధర్, శిరీష సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మంచు మనోజ్ భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాపై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారాయన. నలుగురు కథానాయికలతో కలిసి ఆడిపాడాడు. మరి ఎలా సందడి చేస్తాడో చూడాలి.