ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 26 September 2013

    రామయ్యా వస్తావయ్యా సినిమా లీకయింది

    రామయ్యా వస్తావయ్యా సినిమా లీకయింది, NTR Ramayya Vastavayya Movie Leaked
    లీక్ అంటేనే సినిమా వాళ్లకు దడ పుడుతోంది, కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఈ తరుణంలో ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా లీకయింది అంటూ టాలీవుడ్ లో ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో అందరి గుండెలు గుబెల్లు మన్నాయి.

    ‘అత్తారింటికి దారేది’ పైరసీ నుంచి కోలుకోక ముందే ఇదేంటి అనుకున్నారంతా, అయితే ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా మొత్తం కాదని, ఆ సినిమాలోని కొంత స్టోరీ లీకయిందని వచ్చిన వార్తలతో టాలీవుడ్ కాస్తా శాంతించింది. ఎన్టీఆర్, సమంత, శృతిహాసన్ లు ప్రధానపాత్రలుగా వస్తున్న ఈ సినిమా స్టోరీపై అంతటా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే.

    ఈ సినిమాలో శృతిహాసన్ నెగెటివ్ రోల్ లో వస్తోందని ఇప్పటికే బయటకు పొక్కింది. ఆమె భయపెట్టే పాత్రలో వచ్చి సమంత కుటుంబంలో ప్రశాంతత లేకుండా చేస్తుందట. అంతే కాదు ఎన్టీఆర్ కూడా మరో రకంగా ప్రవేశించి శృతిహాసన్ ఆగడాలకు చెక్ పెడుతాడట. శృతిహాసన్ ఎలాగయితే రెండు పాత్రలతో అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తనుందో అలాగే ఎన్టీఆర్ కూడా కాలేజి స్టూడెంట్ గా పోలీసు ఆఫీసర్ గా రెండు పాత్రల్లో కనిపించనున్నాడు అన్న స్టోరీ కొంత లీకయింది అంటున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood