ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 26 September 2013

    అసెంబ్లీ రౌడీ మళ్లి వచ్చేస్తోంది

    Asembly Rowdy Re Entered in Tollywood, అసెంబ్లీ రౌడీ మళ్లి వచ్చేస్తోంది
    తెలుగు సినీరంగంలో బంపర్ హిట్టుకొట్టి, ఆనాటి రాజకీయ పరిస్థితులను కళ్లకు కట్టిన ‘అసెంబ్లీ రౌడి’ కి ఇప్పుడు వారసుడొస్తున్నాడట. కారణం రాష్ట్రంలో మళ్లీ రాజకీయాలు రచ్చరచ్చ అయిన నేపథ్యంలో ఇక రావాల్సిందే అని ‘అసెంబ్లీ రౌడి’ సిద్దమవుతున్నాడు అంటున్నారు.

    కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అప్పట్లో దివ్యభారతితో కలిసి ’అసెంబ్లీ రౌడి’ గా తెరపైకి వచ్చి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ బంపర్ హిట్టును ఆయన వారసుడు మంచు విష్ణు రీమేక్ చేసేందుకు తయారయ్యాడట. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ విష్ణుతో తెరపైకి తేనున్నాడని సమాచారం.

    ఈ సినిమాలో ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్తితులు కళ్లకు కట్టినట్లుగా ఉండబోతున్నాయట. ఇప్పడు దూసుకెల్తా సినిమా షూటింగ్ తో, పూరి జగన్నాథ్ హార్ట్ ఎటాక్ సినిమాతో విష్ణు బిజీగా ఉన్నారు. ఈ రెండు పూర్తవగానే ‘అసెంబ్లీ రౌడి’ ప్రారంభం అవుతుంది అంటున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood