ఈ మధ్య హీరోయిన్ లు అన్ని విషయాల్లో భాగా అడ్వాన్సు అవుతున్నారు. మన దగ్గర ఉన్నది ఎక్కువగా పరభాషా హీరోయిన్ లే కాబట్టి వీరికి తమ సినిమాలకు తామే డబ్బింగ్ చెప్పుకోవాలనే ఉబలాటం ఎక్కువైంది. ఇప్పటికే ఈ ప్రయత్నంలో తాప్సి ముందుంది. తాప్సీ ఇప్పటికే మొగుడు చిత్రంలో డబ్బింగ్ చెప్పుకుంది. ఇప్పుడు మరో హీరోయిన్ డబ్బింగ్ కి రెడీ అయ్యింది. ప్రస్తుతం చిన్మయ్ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ తో డబ్బింగ్ చెప్పించుకుంటున్న సమంత, ముందు ముందు తన వాయస్‌కు తనే డబ్బింగ్ చెప్పుకోవాలని తెగ ఆరాట పడుతుందట. అయితే డైరెక్టర్స్ మాత్రం సమంతతో డబ్బింగ్ చెప్పించడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. అందుకే సమంత ఈ విషయంలో చాలా కోపంగా ఉందట. తాను తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నా కూడా డబ్బింగ్ చెప్పించలేక పోతున్నారని తెగ ఇదై పోతుంది అమ్మడు.
Saturday, 23 November 2013
Tollywood