పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యామిలితో ఏ విధంగా ఎంజాయ్ చేస్తాడో అని అందరూ అనుకుంటారు. ఈ రోజు బాలల ధినోత్సవం కనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తన పిల్లలతో ఎటువంటి చనువ ఉందో దానికి సంబంధించిన ఒక ఉదాహరణ చెప్పాలి.పవన్ కళ్యాణ్ తన ఇద్దరి పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపటానికి ఆసక్తి చూపిస్తాడు. ముఖ్యంగా అకీరానందన్, ఆధ్యాలతో ఎక్కువుగా పవన్ ఆడుకుంటాడు. కూతురు ఆధ్యా కంటే కొడుకు అకీరా నందన్ ఎక్కువ సార్లు షూటింగ్ లొకేషన్స్‌కు అటెండ్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ షూటింగ్ హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రదేశాలలో జరుగుతుంటే అక్కడ అకీరా నందన్, పవన్‌కు తోడుగా ఉండాల్సిందే. అలాగే లాంగ్ ఫారిన్ షెడ్యూల్స్ ఉంటే పవన్ పిల్లలతో సహా ఫారిన్ షెడ్యూల్‌కు హాజరు అవుతాడు. తీన్‌మార్, కెమెరామెన్ గంగతో రాంబాబు, అత్తారింటికిదారేది షూటింగ్ లొకేషన్స్‌లో ఎక్కువుగా పవన్‌తో పాటు అకీరానందన్ ఉంటాడు. ఒక వేళ పవన్, షూటింగ్ బిజి షెడ్యూల్స్‌తో ఎక్కవు రోజులు ఫ్యామిలికు కేటాయించలేకపోతే, ఆ సమయాన్ని మరోవిధంగా కేటాయిస్తాడు. మూవీకు సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ పూర్తయ్యిన వెంటనే ఓ నెల రోజుల పాటు ఫ్యామిలితో ఫారిన్ టూర్‌కు వెళతాడు. రీసెంట్‌గా అత్తారింటికి దారేది సక్సెస్ మీట్ తరువాత కూడ పవన్ ఫ్యామిలి టూర్ వెళ్ళాడని టాలీవుడ్ చెబుతుంది. ఈ విధంగా పవన్ తన పిల్లలు ఇద్దరూ ఆధ్యా, అకీరా నందన్‌తోనే ఎక్కువుగా గడుపుతుంటాడు.

