అసెంబ్లీ ప్రొరోగ్ చేయడాని ముఖ్యమంత్రి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి నుంచి స్పీకర్ కు లేఖ పంపించారు. ఇందులో భాగంగా అసెంబ్లీ సమావేశాలను ప్రొరోగ్ చేయాలంటూ స్పీకర్ త్వరలో ఈ లేఖను గవర్నర్ కు పంపిస్తున్నట్టు వార్తలు వెలుబడ్డాయి. ఇదే కనుక జరిగితే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గందరగోళంలో పడవచ్చు. అదే జరిగితే ఇప్పటికిప్పుడు తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవచ్చన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా తెలస్తోంది. శాసన సభ సమావేశాలు నిరవధిక వాయిదా పడితే సమీప భవిష్యత్తులో మళ్లీ సమావేశాలు లేకుంటే గవర్నర్ దానిని ప్రొరోగ్ చేస్తారు. ఇలా చేయమని శాసన సభ కార్యదర్శి నుంచి ముఖ్యమంత్రికి ఓ నోట్ వెలుతుంది, దానిని ఆయన గవర్నర్ కు పంపిస్తారు, వెంటనే దానిని గవర్నర్ ప్రొరోగ్ చేయవచ్చు. అప్పుడు శాసన సభ తిరిగి సమావేశం కావాలంటే గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వాలి, అందుకోసం ముఖ్యమంత్రి సిఫారసు చేయాలి, ఇలా చేయకుండా సమావేశాలను అడ్డుకోవచ్చన్నది సిఎం వ్యూహంగా తెలుస్తోంది.

