ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Wednesday, 20 November 2013

    హీరోనా? విలనా?

    Hero or villan, హీరోనా? విలనా?
    విభజన వ్యవహారంలో ఒక్క అంగుళం కూడా బెసగని ‘సమైక్య’వాదిగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణ ప్రాంతీయుల దృష్టిలో విలన్‌గా మారాడు. ఆయన పట్ల తెలంగాణ నాయకుల్లో ఎంతటి విముఖత ఏర్పడిందంటే మెదక్, వరంగల్ తదితర జిల్లాల్లో జరిగిన రచ్చబండలో కిరణ్ పాల్గొంటే తాము బహిష్కరిస్తామని ప్రకటించారు. కొన్ని చోట్ల ఆయన ఫోటోలున్న ఫ్లెక్సీలను ఉంచేందుకు కూడా వారు ఇష్టపడటం లేదు. అయితే ఇదే వ్యవహారాల కారణంగా కిరణ్ సీమాంధ్రలో హీరో అవుతున్నారు. కొసవరకు సీమాంధ్రలో కిరణ్ హీరో గానే వుంటారా? జీరో అవుతాడా?అన్నది ఇప్పడు ప్రశ్న.

    కిరణ్ స్వపక్షంలోని మంత్రులు, మిత్రులు ఆయన తన భవిష్యత్తును తీర్చి దిద్దుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించగలరే తప్ప ఎటువెళ్ళాలి, ఎలాంటి వైఖరిని అవలంభించాలని నిర్ణయించుకోవడం మాత్రం కిరణ్ స్వయంగా చేయవలసిందే. కేంద్ర మంత్రుల బృందం సోమవారం నిర్వహించిన సమావేశంలో తాను విభజనకు వ్యతిరేకంగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్తూ దాదాపు గంటసేపు చేసిన ప్రసంగానికి సంబంధించిన వివరాలను కిరణ్ మీడియా సమావేశంలో వివరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి గల కారణాలను వివరించి , సీమాంధ్రకు బదులు తెలంగాణ ప్రాంతానికి ప్యాకేజీ ఇవ్వాలని తాను జివోఎంను కోరినట్లు కిరణ్ మీడియాకు చెప్పారు. అయితే కిరణ్ జివోఎంతో భేటీలో విభజనకు అనుకూలంగా మాట్లాడి బయటికి వచ్చి విభజనను తాను వ్యతిరేకించినట్లు నాటకాలు ఆడుతున్నాడని, ముఖ్యమంత్రికి తెలియకుండా విభజనపై రాష్ట్రం నుంచి నివేదికలు ఎలా వెళ్తాయని తెలుగుదేశానికి చెందిన రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి అనుకూలంగా తన వాదనను బలంగా వినిపించడం ద్వారా తెలంగాణ ప్రాంతీయుల దృష్టిలో విలన్‌గా మారిన కిరణ్ 2014 ఎన్నికల వరకు తెలంగాణ ఏర్పాటును ఆడ్డుకోగలిగితే సీమాంధ్రుల దృష్టిలో హీరో అవుతారు. అలాకాకుండా హైకమాండ్ వత్తిడి వల్ల అసెంబ్లీలో విభజనకు అనుకూలంగా మారితే జీరో అవుతారు. ఇక కొన్ని ప్రసార సాధనాలలో వచ్చినట్లు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకుని సొంత పార్టీ పెట్టే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే కిరణ్ పెట్టే పార్టీ మరో రెడ్డికాంగ్రెస్ అవుతుంది. ఇదివరకే కాంగ్రెస్ నుంచి విడిపోయిన పిల్ల కాంగ్రెస్ పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విధంగా రెడ్డి కులస్థుల పార్టీయే అని చెప్పాలి. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన వారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడు కొత్తగా కిరణ్ పార్టీ పెట్టడం వల్ల వైఎస్‌ఆర్‌సిపి నుంచి వచ్చే వారు చాలా తక్కువ మంది. విభజనకు వ్యతిరేకంగా పార్టీ సమావేశాల్లో, బహిరంగ సభల్లో సమైక్య వాణిని గట్టిగా వినిపించిన కిరణ్‌గాని, ఆయన వర్గానికి చెందిన మంత్రులు గాని కిరణ్ పార్టీ పెడతాడని ఎప్పుడూ చెప్పలేదు. ఆయనకు ఉన్న బలం ఉద్యోగులు. సీమాంధ్రకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డెబ్బయి రోజుల పాటు విభజనకు వ్యితిరేకంగా ఉద్యమించి కిరణ్ వాదనకు బలం చేకూర్చారు. జివోఎం సమావేశంలో కిరణ్ చేసిన వాదనలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన అంశం ప్రధానంగా ఉండటం గమనించాల్సిన విషయం. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఉద్యోగుల నుంచి బదిలీలకు వ్యతిరేకంగా, ప్రమోషన్లు కోరుతూ వేలాదిగా పిటిషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని కిరణ్ హెచ్చరించడం చెప్పుకోదగిన అంశం.

    ఇలా వివధ అంశాలు వున్నాయి.కానీ తెలుగుదేశం, వైకాపా మాత్రం కిరణ్ డ్యూయల్ రోలో అని విమర్శిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎలా వున్నా, అసెంబ్లీకి బిల్లు వచ్చాక, నిజరూపం బయటపెట్టాల్సిందే. అప్పుడు కూడా కిరణ్ ఇలాగే వుంటే దేశం,వైకాపా ల ప్రచారం తప్పు అవుతుంది. కిరణ్ హీరోగా మిగిలిపోతారు. లేదు విభజనకు ఓకె అంటే, ఇన్నాళ్లు ప్రతి పక్షాలు చెప్పింది నిజమవుతుంది. చివరిదాకా కిరణ్ ఇదే వైఖరిని కొనసాగిస్తారా?  హీరో కాగలరా? వేచి చూస్తే కానీ తెలియదు.

    Tollywood

    Bollywood

    Kollywood