సినిమా స్టార్లు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఇటీవలే ఎన్టీఆర్ ఇంట్లో ఆ అపరిచితుడు ప్రవేశించాడు. ఇప్పుడు శ్రుతిహాసన్ ఇంట్లోనూ అదే సీన్. మంగళవారం ఉదయం ముంబైలోని శ్రుతిహాసన్ నివాసంలోకి ఓ అగంతకుడు చొరబడానికి విఫలయత్నం చేశాడు. శ్రుతి ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. మంగళవారం ఉదయం ఇంటి తలుపు చప్పుడైతే తెరిచింది.ఎదురుగా ఓ అగంతకుడు. తెలియని వ్యక్తి. పైగా అనుమానాస్సదంగా ఉండడంతో శ్రుతి డోర్‌ని మూయడానికి ప్రయత్నించింది. కానీ తను బలవంతంగా డోర్ నెట్టుకొని లోపలకు రావడానికి చూశాడు. శ్రుతి కాస్త ధైర్యం తెచ్చుకొని రెండు చేతులతో డోర్‌ని వేసేసిందట. దాంతో అగంతకుడు పారిపోయాడు. ``ఈ సంఘటన నన్ను షాక్ కి గురిచేసింది..`` అని శ్రుతిహసన్ చెబుతోంది. అయితే శ్రుతి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
Wednesday, 20 November 2013
Tollywood

