ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 3 December 2013

    తెలంగాణా రాష్ట్రానికి పిడుగులాంటి వార్త!

    బిజినెస్ స్టాండర్డ్ ఇచ్చిన ఓ కథనం తెలంగాణా రాష్ట్రానికి ఓ పిడుగులాంటి వార్తేనని చెప్పాలి. అప్పట్లో శ్రీకృష్ణ కమిటీ రహస్య నివేదిక ఆధారంగా బిజినెస్ స్టాండర్డ్ ప్రచురించిన ఓ కథనం హైదరాబాదీలకు మింగుడు పడని వార్తేనని చెప్పాలి. గతంలో శ్రీకృష్ణ కమిటీ 2010 డిసెంబర్ 30న ఆరు సిఫార్సులతో నివేదిక సమర్పించడం తెలిసిందే. అయితే కమిటీ తన అసలు అభిప్రాయాన్ని ఒక రహస్య నోట్ రూపంలో కేంద్ర హోం శాఖకు కమిటీ అందజేసింది. ఆ నోట్ లో ఉన్న విషయాలను బిజినెస్ స్టాండర్డ్ ఆంగ్ల దినపత్రిక తాజాగా బయటపెట్టింది.
    ఇంతకీ ఆ కథనం సారాశం ఏమిటంటే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో ఆర్థిక ఇక్కట్లు, మావోయిజం పునరుత్థానం, మతపరమైన ఉద్రిక్తతలు ప్రబలి హైదరబాద్ పునఃవైభవాన్ని కోల్పోతుందని ఆర్ధిక స్థితి దిగజారిపోతుందని పేర్కొంది. హైదరాబాద్ రాజధానిగా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే అది తెలంగాణవాదుల భావోద్వేగాలను తృప్తి పరచవచ్చేమో కానీ ఆర్థికంగా మాత్రం అది ఎలాంటి లబ్ధి చేకూర్చజాలదని.. ఎందుకంటే హైదరాబాద్‌ను పూర్తిగా తెలంగాణకే పరిమితం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని, వాటికి నిరసనగా మరికొన్ని పలు కొత్త తరహా ఉద్యమాలు పుట్టుకొచ్చి హింసకు కూడా దారితీస్తుందని.. ఇదో విషవలయంలా సాగుతూ నగర ఆర్థిక వ్యవస్థ, ఆదాయోత్పత్తిని పూర్తిగా దెబ్బ తీస్తుందని ఆ కథనంలో పేర్కొన్నారు.

    ఆదాయ వ్యవస్థ దెబ్బతినడంతో నిరాశా నిస్పృహలకు గురైన ప్రజల ఆగ్రహానికి హైదరాబాద్‌లో, తెలంగాణలో ఉండే సీమాంధ్రులు బలి కావచ్చని.. నిరాశకు లోనైన తెలంగాణవాసులు సీమాంధ్రులపై ఉద్దేశపూర్వక దాడులకు కూడా దిగవచ్చని.. తెలంగాణ అనుకూల పార్టీలు గుప్పించిన భారీ హామీలేవీ నెరవేరక యువతతో పాటు పలు సామాజిక వర్గాల్లో తీవ్ర అసంతృప్తి రగిలి మావోయిజం వైపు ఆకర్షితులై సాయుధ బాట పడతారని.. హిందూ, ముస్లింల మధ్య మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తి హిందూ అతివాదం, జిహాదీ తీవ్రవాదం ప్రబలే ప్రమాదముందని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కొద్ది కాలంలోనే ఒక విఫల రాష్ట్రంగా మిగిలిపోవచ్చని నిర్మొహమాటంగా చెప్పేసింది.

    No comments:

    Post a Comment

    Tollywood

    Bollywood

    Kollywood