ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here

Tuesday, 3 December 2013

పవన్ ఆలోచించే మూడు విషయాలు ఇవే!

పవన్ ఆలోచించే మూడు విషయాలు ఇవే, పవన్ ఆలోచించే మూడు విషయాలు
పవన్ కళ్యాణ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. హిట్ ..ప్లాప్ లకు సంభంధం లేకుండా పాలోయింగ్ సంపాదించడం ఆయన నైజం. సమస్యలను గుర్తించి ప్రశ్నించడం ఆయన తత్త్వం. సాదారణంగా ఆయన ఎవరికీ చిక్కని వ్యక్తి. అరుదుగా మీడియా ముందుకు వచ్చే ఆయన ఏమి చెబుతాడా అని చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.

పవన్ తాజాగా ఒక ప్రముఖ దిన పత్రికకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులోని ముఖ్యమైన విషయాలు ఇవే. పవన్ కళ్యాణ్ తన మైండ్ ఎక్కువ టైం మూడు విషయాలతో నిండిపోయి ఉంటుందని.. వాటి గురించే ఆలోచిస్తానని.. అవే ప్రకృతి, పిలాసఫీ మరియు సామాజిక సమస్యలు అని చెప్పుకొచ్చాడు. నేను సాధారణ విద్యార్దిని, సాధారణ జీవితం గడపాలి అనుకునేవాడ్ని, ఎప్పుడూ హీరోని అవుదాం అని అనుకోలేదని.. తోటమాలిగా బ్రతకాలని నా ఆశ, నా తోటలో గడిపే సమయాన్ని చాల ఆస్వాదిస్తానని చెప్పాడు.

ఇక ఆయన కోపం గురించి అడిగినప్పుడు ఆయన నవ్వుతూ.. అవసరమైనంత వరకు వయొలెన్స్ ఉండాలనే నమ్ముతాను కానీ అనవసరమైన దానికల్లా వయొలెన్స్ ఉండకూడదని.. దీనికి ఓ ఉదాహరణ చెబుతూ.. మీ ఇంట్లోకి ఒక దొంగ వస్తే మీరు చేతులు కట్టుకొని అతనికి మర్యాదలు చేస్తారా లేక అతన్ని పట్టుకొని కొడతారా?’ అని చమత్కారంగా ఉదాహరణ ఇస్తూ.. అలాంటి సందర్భాల్లో మన మనస్సాక్షిని బట్టి రియాక్ట్ అవుతారని పవన్ తెలిపాడు.

ఇక రాజకీయాల గురించి అడగగా ఆయన ఆయన కూడా తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అపజయం తరువాత రాజకీయాల గురించి మాట్లాడలేదు, మళ్ళీ రాజకీయాలలోకి  వస్తారా? అని అడిగిన ప్రశ్నకు నేను అసలు రాజకీయాలకి దూరంగా ఉంటే కదా మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికని సమాధానం చెప్పారు.

Post Comments

No comments:

Post a Comment