ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 22 November 2013

    వర్ణ రివ్యూ

    వర్ణ రివ్యూ, వర్ణ సినిమా రివ్యూ, వర్ణ సమీక్ష, వర్ణ
    చిత్రం – వర్ణ
    నటీనటులు – అనుష్క, ఆర్య
    సంగీతం – యువన్ శంకర్ రాజా 
    బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – అనిరుధ్
    నిర్మాత – పరమ్ వి పొట్లూరి
    రచన, దర్శకత్వం- శ్రీ రాఘవ
    విడుదలైన తేది – 22-11-2013

    ఇ24తెలుగు.కామ్ రేటింగ్ : 1/5

    దర్శకుడు శ్రీ రాఘవ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ప్రేమ కథలతోనే ఆగిపోయే దర్శకుడు కాదు. యుగానికి ఒక్కడు లాంటి చారిత్రక, ఫాంటసీ కథల్ని సైతం అద్భుతంగా తెరకెక్కించగలడని నిరూపించుకున్నాడు. అందుకే పివిపి నిర్మాణ సంస్థ శ్రీరాఘవ చేతికి 65 కోట్లు ఇచ్చింది. వర్ణ అనే ప్రాజెక్ట్ మొదలైనప్పటినుంచే భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఎందుకంటే ఈ చిత్ర కథ ఎవరూ ఊహించిన విధంగా ఉంటుదని చెప్పడమే కారణం. రెండు ప్రపంచాల్లో జరిగే ప్రేమ కథగా దర్శకుడు చెప్పాడు. దీంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ముఖ్యంగా ఆ రెండో ప్రపంచం గురించే చర్చించుకున్నారంతా. ఇక అనుష్క హీరోయిన్ కావడం.. తమిళ హీరో ఆర్య కథానాయకుడిగా నటిస్తుండడంతో ఆసక్తి పెరిగింది. జార్జియా లాంటి మైనస్ డిగ్రీ సెల్సియస్ చలిలో షూటింగ్ చేశారు. అంతే కాకుండా బుడా పెస్ట్ లో చిత్ర రీరికార్డింగ్ చేయించారు. విదేశీ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అందించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మరి ఇన్ని అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఏ మేరకు అకట్టుకుందనేది తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ అవ్వాల్సిందే.

    కథ…
    దర్శకుడు చెప్పినట్టు ఈ చిత్ర కథ రెండు ప్రపంచాల్లోనే జరుగుతుంది. ఒకటి ప్రెజెంట్ స్టోరీ. రమ్య (డాక్టర్). మధుబాలకృష్ణ(ఆర్య)ను ప్రేమిస్తుంది. తన ప్రేమనను వ్యక్తం చేస్తుంది. కానీ మధుబాలకృష్ణ ఒప్పుకోడు. ఆ తర్వాత మధు రమ్యను ప్రేమించేందుకు ప్రయత్నిస్తాడు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమలో ఉండగానే ఓ ప్రమాదం జరుగుతుంది.

    మరో కథ ఓ గ్రహంలో జరుగుతుంది. ఇందులో దళపతి కుమారుడు మహేంద్ర(ఆర్య) వర్ణ (అనుష్క)ను ప్రేమిస్తాడు. దళపతి కుమారుడైనా యుద్ధవిద్యలు రాకపోవడంతో సైన్యంలో చేర్చుకోరు. వర్ణ మాత్రం కత్తి యుద్ధాలు బాగా చేస్తుంది. సైన్యంలో చేరేందుకు విశ్వప్రయత్నం చేస్తుంది. ఆ రాజ్యంలో స్త్రీలుబానిసలు. అక్కడ ఓ దేవత ఉంటుంది. ఆమెను ఎత్తుకెళ్లేందుకు పక్క దేశపు రాజు దాడులు చేస్తుంటాడు. చివరికి మహేంద్ర, వర్ణను పెళ్లి చేసుకంటాడు. కానీ తనను బానిసగా చూస్తున్నాడని రాజుపై దాడి చేయబోతుంది. ఇలా రెండు లోకాల్లో రెండు ప్రేమ కథలతో ముందుకెళ్తుంది.

    వీరి ప్రేమ కథలకు ఎలా ముగిశాయి. దేవతను ఎత్తుకెళ్లే ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయి. రమ్య మధు ప్రేమ కథలోని ట్విస్ట్ ఏంటనేది తెరమీదే చూడాలి.

    సమీక్ష:
    అనుష్క, ఆర్య బాగా నటించారని చెప్పక్కర్లేదు. ఎందుకంటే నటించేందుకు పెద్దగా స్కోప్ లేదు కాబట్టి. ఈ జంట తప్పితే సినిమాలో మనకు పరిచయమున్న వ్యక్తులు ఎవ్వరూ లేరు. క్యారెక్టర్ నటుడు అశోక్ కుమార్ మాత్రం ఆర్య తండ్రిగా కొద్దిసేపు కనిపిస్తాడు. పాటలు జనాలకు ఎక్కలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. అనిరుథ్ తన టాలెంట్ చూపించాడు. ముఖ్యంగా ఆర్య సింహంలాంటి జివితో యుద్ధం చేసినప్పుడు, దేవత కనిపించే సన్నివేశాల్లో అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. పివిపి సంస్థ గ్రాండియర్ గా చిత్రాన్ని నిర్మించింది. గ్రాఫిక్స్ విషయానికి వస్తే ప్రకృతి సోయగాల్ని అత్యద్భుతంగా చూపించారు. తెలుగు తెరపై గ్రాఫిక్స్ తో ప్రకృతిని ఇంత అందంగా చూపించడం మొదటిసారి. ఈ విషయంలో గ్రాఫిక్స్, యనిమేషన్ డిపార్ట్ మెంట్ ని మెచ్చుకోవాల్సిందే.

    ఇక కథ విషయానికొస్తే… కథే లేదని చెప్పొచ్చు. ఉన్నా అది కథ కాదనీ చెప్పొచ్చు. ఓ సినిమా కథ చెబితే చందమామ కథల్లా చక్కగా చెప్పాలి. అందరికీ అర్థమయ్యేలా చెప్పగలగాలి. శ్రీ రాఘవ ఈ కథను ఎందుకు ఎంచుకున్నాడో ఎవ్వరికీ అర్థం కాని విషయం. ప్రేమ గురించి చెప్పాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా చెబితే బాగుండేది. రెండు లోకాల్ని ఎంచుకొని జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం కాకపోతే. కథే సరిగ్గా కుదరనప్పుడు దర్శకుడు మాత్రం ఏం చెబుతాడులే అనేవారూ లేకపోలేదు. మొత్తంగా వర్ణ చిత్ర కథ రెండు లోకాల్లో జరుగుతుంది. రెండు కథల్ని మొదటి సగంలో చూపించేశాడు. ముగించేశాడు. ఎవరూ ఊహించని ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చాడు. ఇంటర్వెల్ తర్వాత ఇంటికే వెళ్లేలాంటి ఇంటర్వెల్ మరి అది. సన్నివేశాల మధ్య పొంతన కుదరకపోవడంతో ప్రేక్షకుడు అసహనానికి గురయ్యాడు.

    ఇలాంటి ఫాంటసీ చిత్రాల్లో యాక్షన్ పార్ట్ ని అద్భుతంగా చూపించొచ్చు. కనీసం ఆ విషయంలోనూ దర్శకుడు సక్సెస్ కాలేదు. పేలవమైన యాక్షన్ పార్ట్ తో ఉస్సూరుమనిపించాడు. అనుష్క కత్తి యుద్ధాలతో భీభత్సం చేస్తుందని ఊహించారంతా కానీ సింపుల్ ఫైట్స్ తో లాగించేశారు. మొదటి అర్థగంటలోనే సినిమా కథ చెప్పేసిన తర్వాత మిగిలిన రెండు గంటలు ప్రేక్షకుడిని థియేటర్లో కూచోబెట్టాలంటే దర్శకుడు అద్భుతాలు సృష్టించాల్సిందే. కానీ అవేవి శ్రీ రాఘవ చేయలేదు. అవసరం లేని సన్నివేశాలతో విసుగు తెప్పించాడు. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ప్లస్ లు చాలా అంటే చాలా తక్కువ… మైనస్ లు ఎక్కువంటే చాలా ఎక్కువ కనిపిస్తాయి.

    ప్లస్ :
    అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

    మైనస్ :
    స్టోరీ
    పెర్ ఫార్మెన్స్
    పాత్రల రూపకల్పన
    డబ్బింగ్
    డైలాగ్స్
    ఫైట్స్
    డైరెక్షన్
    స్క్రీన్ ప్లే

    తీర్పు: 
    అసహనాన్ని లెక్కలేనంతగా దర్శకుడు పంచిపెట్టారనడానికి వెనుకాడనవసరం లేదు. ఇంతకంటే ఈ చిత్రం గురించి ఏమి చెప్పలేం. భారీ బడ్జెట్ తో తలా తోకా లేకుండా రూపొందిన వర్ణ నిరాశపరిచించింది.

    Tollywood

    Bollywood

    Kollywood