ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 22 November 2013

    షార్ట్ క‌ట్ టు.. న‌ర‌క‌లోకం - వ‌ర్ణ‌

    షార్ట్ క‌ట్ టు.. న‌ర‌క‌లోకం - వ‌ర్ణ‌
    ఈ సినిమాలో రెండు లోకాలు చూపిస్తున్నానోచ్ అన్నాడు శ్రీ‌రాఘ‌వ‌.. వ‌ర్ణ సినిమా ఆడియో వేడుక‌లో.
    1. భూలోకం
    2 మ‌న‌కు తెలిని మ‌రో లోకం.

    ఈ రెండులోకాల్ని చూపించ‌డానికి రూ.60 కోట్లు ఖర్చు పెట్టాడ‌ట‌. అయితే కానీ ఖ‌ర్చు లేకుండా ప్రేక్ష‌కుల‌కు ఫ్రీగా మ‌రో లోకం కూడా చూపించాడు.

    అది న‌ర‌క‌లోకం. నిజ్జమండీ బాబూ. న‌ర‌కానికి షార్ట్ క‌ట్‌, ట్రైల‌ర్‌, టీజ‌ర్ - ఇలా ఏదైనా చెప్పుకోండి. దానికి ప‌ర్యాయ ప‌దం.. వ‌ర్ణ‌!!  సాధార‌ణంగా రివ్యూలో క‌థ‌, విశ్లేష‌ణ‌, న‌టీన‌టుల ప్ర‌తిభ‌, హైలెట్స్, ప్ల‌స్‌, మైన‌స్‌.. అంటూ ఎన్నో విభాగాలు ఉంటాయ్‌. ఈ ఒక్క రివ్యూకి ఇవ‌న్నీ మిన‌హాయించుకోవాల్సిందే. రివ్యూ ఆది, అంతం లేకుండా అడ్డ‌దారులు తొక్కుతోందంటే, పొగ‌డ్త‌లు లేకుండా తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకొందంటే అది మా త‌ప్పుకాదు. వ‌ర్ణ సైడ్ ఎఫెక్ట్స్ అనే విష‌యాన్ని గుర్తించుకొంటార‌ని మ‌న‌వి.

    క‌థ చెబుదామంటే అందులో బోలెడ‌న్ని క‌న్‌ఫ్యూజ‌న్లు ఉన్నాయి. అది చెప్పినా మీ బుర్ర‌కెక్క‌ద‌ని మా న‌మ్మ‌కం. రెండు గంట‌ల న‌ల‌భై నిమిషాల సినిమా చూస్తేనే మాకేం అర్థం కాలేదు. ఇక నాలుగు లైన్ల‌లో క‌థ చెబితే తెలుస్తుందా??  అయినా స‌రే, చిన్న ప్ర‌య‌త్నం చేస్తా.  అన‌గ‌న‌గా ర‌మ్య అనే డాక్ట‌రు పిల్ల‌. ఆమె తొలి చూపులోనే మ‌ధుని చూసి ప్రేమిస్తుంది. మ‌ధుకి ఇంట్లో స‌మ‌స్య‌లున్నాయి. అందుకే ర‌మ్య ప్ర‌పోజ‌ల్ సున్నితంగా తిర‌స్క‌రిస్తాడు. కానీ.. ఆమెనే ప్రేమిస్తాడు. అదే విష‌యం ర‌మ్య‌తో చెబితే.. అయ్యో నాకు పెళ్లి కుదిరిపోయింది. నేను గోవాలో మెడిక‌ల్ క్యాంప్ కోసం వెళ్లున్నా. త‌ను కూడా అక్క‌డికి వ‌స్తాడు.. అని చెబుతుంది. దాంతో ర‌మ్య‌తో పాటు మ‌ధు కూడా గోవా వెళ్లిపోతాడు. అక్క‌డ ర‌మ్య మ‌న‌సు గెలుచుకొంటాడు. ఇద్ద‌రూ పెళ్లి చేసుకొందాం అనుకొంటారు. కానీ.. అనుకోకుండా ర‌మ్య చనిపోతుంది. ఆమె జ్ఞాప‌కాల‌తో గ‌డుపుతున్న మ‌ధు..కి ఓ ర‌హ‌స్యం తెలుస్తుంది. ర‌మ్య‌లాంటి అమ్మాయి మ‌రో లోకంలో ఉంద‌ని. మ‌నసుతో చూస్తే.. క‌నిపిస్తుంద‌ని. మ‌రి మ‌ధు మ‌రో లోకం వెళ్లాడా?  అక్క‌డ ర‌మ్య‌ని చూశాడా?  అన్న‌దే వ‌ర్ణ క‌థ‌.

    అరుణాచ‌లం సినిమా గుర్తుందా?  అందులో హీరోకి ఓ స‌వాల్ ఎదుర‌వుతుంది. 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టాలి. దాని కోసం చాలా పాట్లు ప‌డ‌తాడు. ఖ‌ర్చు పెట్ట‌డం ఇంత క‌ష్ట‌మా?? అనిపిస్తుంది. పాపం.. ఆ రోజుల్లో శ్రీ‌రాఘ‌వ లాంటి ద‌ర్శ‌కులు లేరు. ఉంటేనే 30  యేంటి, 300 కోట్ల‌ని కూడా ఇలా మంచినీళ్ల‌లా ఖ‌ర్చు పెట్టేస్తుంటాడు. పీవీపీ ద‌గ్గ‌ర డ‌బ్బులు ఎక్క‌వైపోయి.. నాయినా ఈ 60 కోట్లు కాస్త ఖ‌ర్చు చేసి చూపించూ.. అని అడిగి ఉంటారు. మ‌నోడు రంగంలోకి దిగిపోయి.. బీభ‌త్సంగా ఖ‌ర్చు చేయ‌డానికి ఈ సినిమా తీసుంటారు..??

    మాటాడితే మీనింగు ఉండాలంటారు. సినిమా తీసినా అంతే. క‌థ అర్థ‌వంతంగా లేక‌పోయినా ఫ‌ర్లేదు. ప్రేక్ష‌కుడికి అర్థ‌మైతే చాలు. కానీ ఈ క‌థ‌లో ఆ ల‌క్ష‌ణం లేదు. రాఘ‌వ రాత్రి త‌న‌కొచ్చిన క‌ల‌ని పొద్దుట లేచి సినిమాగా తీసేసి ఉంటాడు. దాని కోసం అర‌వై కోట్లు బ‌ల‌య్యాయి. అవ‌తార్‌లాంటి సినిమా మ‌న‌వాళ్లు ఎంకు తీయ‌కూడ‌దు..?? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం అన్వేషించాల‌ని ఈ సినిమా తీసుంటాడు. ప్రేక్ష‌కుల‌కు త‌ల‌నొప్పి ని రుచి చూపించాడు. అస‌లు రెండు లోకాల కాన్సెప్టే ప్రేక్ష‌కుల‌కు అర్థం కాదు. ఒక లోకంలోంచి మ‌రో లోకంలోకి ఇంత ఈజీగా మ‌నుషులు వెళ్లిపోతారా?  మ‌రో లోకం అంటే చిత్ర‌విచిత్ర వేష‌ధార‌ణ‌తో మ‌నుషులు ఉంటారు అనుకొంటే... అక్క‌డా ఇదే తీరు. విఠ‌లాచార్య జాన‌ప‌ద చిత్రాల్లోలా గెట‌ప్పులు వేయించారు. అక్క‌డా తెలుగు మాట్లాడుకొంటార‌ట‌. ఏంటో ఈ గోల‌..!

    శ్రీ‌రాఘ‌వలోని క్రియేటివిటీ మ‌రీ హైపిచ్‌కి చేరింది. ఏదేదో చూపిస్తాడు. క‌థ సాగే విధానంలో ఎక్క‌డా లాజిక్ ఉండ‌దు. ఏ పాత్ర ఎందుకు ఎలా బిహేవ్ చేస్తుందో తెలీదు. వ‌ర్ణ పాత్ర‌, రెండో లోకం ఈ సినిమాకి బ‌లం అని ద‌ర్శ‌కుడు భావించి ఉంటాడు. కానీ వాటిని శ‌క్తివంతంగా తీర్చిదిద్ద‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. క‌థ‌కు ఏదైతే ప్ల‌స్ అనుకొన్నాడో.. అవ‌న్నీ మైన‌స్ అవుతూ వ‌చ్చాయి. ఆ మాట‌కొస్తే... మ‌ధు, ర‌మ్య‌ల మ‌ధ్య సాగిన ల‌వ్ ట్రాకే కాస్త బెట‌ర్ అనిపిస్తుంది. మ‌రో లోకంలోకి క‌థ ఎప్పుడైతే ఎంట‌ర్ అవుతుందో ... అప్పుడు ప్రేక్ష‌కుడికి త‌ల‌నొప్పులు మొద‌ల‌వుతాయి.

    అనుష్క ని న‌మ్మి తీసిన సినిమా ఇది. కానీ ఆమె చాలా డ‌ల్‌గా క‌నిపించింది. క‌త్తి తిప్పింది గానీ.. అందులో ప‌దును లేదు. అనుష్క ఒక్క ఫ్రేములోనూ అందంగా క‌నిపించ‌దు. ఆమె గ్లామ‌ర్ ఏమైపోయిందో. ఆర్య ఫ‌ర్వాలేదు. కండ‌లు బాగానే చూపించాడు. ఈ రెండు పాత్ర‌లూ మిన‌హాయిస్తే రిజిస్ట‌ర్ అయ్యే క్యారెక్ట‌ర్ ఒక్క‌టంటే ఒక్క‌టీ లేదు. ప్రేమ‌లో ఉన్న స్వ‌చ్ఛ‌త చూపించాల‌నుకొన్నాడు ద‌ర్శ‌కుడు. ఆ విష‌యంలోనూ విఫ‌ల‌మ‌య్యాడు. రమ్య పాత్ర‌ని ఎందుకు చంపేశాడో..?  అస‌లు మ‌రోలోకం సృష్టించాల‌న్న ఆలోచ‌న ఎందుకొచ్చిందో..??  మ‌న ఖ‌ర్మ కాక‌పోతే. లొకేష‌న్లు బాగున్నాయి. కెమెరా ప‌నిత‌నం నీట్‌గా ఉంది. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ బాగున్నాయి. అంతే.. ఈ సినిమా గురించి ఇంకేం చెప్పుకోలేం.

    రాఘ‌వ‌లో పెరిగిన పైత్యానికి ఈ సినిమా ఓ నిద‌ర్శ‌నం. క‌థ విన‌కుండా, స్ర్కిప్టు చూడ‌కుండా నిర్మాత‌లు త‌ప్పు చేస్తున్నారు. టాక్ తెలుసుకోకుండా థియేట‌ర్‌కి వెళ్తే.. ఆ త‌ప్పు మీరూ చేసిన‌ట్టే.

    Tollywood

    Bollywood

    Kollywood