నాగ చైతన్య, సమంతా జంటగా విమర్శకుల ప్రసంసలు పొందిన దర్శకుడు 'దేవ కట్ట' దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆటో నగర్ సూర్య'. అనేక ఆర్ధిక ఓడిడుకులను ఎదుర్కున్న ఈ చిత్రం చాలా రోజుల పాటు విడుదలకు నోచుకోలేక ఈ మధ్యనే మళ్లీ సెట్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మిగిలిన షూటింగ్ పూర్తిచేసి సినిమాను డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అర్అర్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కాగా తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్స్ ట్రైలర్ చూస్తే చిత్రంలో దేవకట్ట తన పెన్నుకు మరింత పదును పెట్టాడని అర్ధమవుతుంది. గతంలో 'ప్రస్థానం' చిత్రంలో అలాంటి మంచి పవర్ ఫుల్ డైలాగులతో కొట్టిన దేవకట్టా 'ఆటో' కోసం డైలాగ్స్ అదిరిపోయేలా రాశారని తెలుస్తుంది.
ఈ సినిమాలోని రిలీజ్ అయిన ట్రైలర్ లో పొలిటికల్ టచ్ కూడా ఉన్నట్లు అర్ధమవుతుంది. అయితే ఇప్పటి వరకు మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న చైతూకి ఈ సినిమా సెట్ అవుతుందా? ఎలాగూ బెజవాడ నేపథ్యంలోనే సాగే సినిమా కావడంతో నాగార్జునకు శివ మాదిరి చైతూకి కూడా ఈ సినిమా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. మరి చైతూకి అంత సీన్ ఉందంటారా? ఏమో చూద్దాం!